వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారో 'మన టీవీ' ద్వారా చూపించారు. అందులో నేహాకి బర్త్ డేకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. అనంతరం హౌస్ మేట్స్ తో మళ్లాడారు నాగార్జున. ‘మా ఇల్లు ఎలా ఉంది?’ అని అడిగారు.దానికి అందరూ 'మన ఇల్లు' అన్నారు. 'అలా అంటే గీతూ ఒప్పుకోదు' అంటూ సెటైర్ వేశారు. గీతూ ‘అలా కాదు సర్’ అనే సరికి, ‘నీతో ఎందుకమ్మా నాకు గలాటా’ అంటూ కౌంటర్ వేశారు. 


రేవంత్ నువ్వు ఇంట్లో బూతులు మాట్లాడుతున్నావ్ అన్నారు నాగ్. రేవంత్ 'నేనా' అనగానే, 'సాక్ష్యాలు చూపించమంటావా' అని అడిగారు నాగ్. వెంటనే వద్దు సర్ అనేశాడు రేవంత్. ఆ తరువాత రోహిత్, మెరీనాలతో మాట్లాడుతూ.. 'రోహిత్ మా అందరి ముందు మెరీనా టైట్ హగ్ ఇవ్వు' అని చెప్పగానే భార్యభర్తలిద్దరూ కౌగిలించుకున్నారు. ఆ సమయంలో 'నారాయణ... నారాయణ వారిద్దరూ మ్యారీడ్' అన్నారు నాగార్జున. ఆ నారాయణ ఎవరో అందరికీ అర్థమయ్యేలా కామెంట్స్ చేశారు. 


అర్జున్ ని పొగిడిన నాగ్:


'వాళ్లేదో అనుకుంటారు.. వీళ్లేదో అనుకుంటారని ఎవరినీ బ్రో అని పిలవక్కర్లేదు అని' కీర్తితో అన్నారు నాగార్జున. 'రీఇన్వెంట్ చేసుకుందామని వచ్చావ్.. కానీ గేమ్ సరిగ్గా ఆడడం లేదు. నువ్ ఆడగలవ్' అని అభినయశ్రీని ప్రోత్సహించారు నాగ్. అర్జున్ కళ్యాణ్ ఆటతీరు బాగుందని పొగిడారు. శ్రీసత్యను ఇంకొంచెం యాక్టివ్ గా ఉండాలని చెప్పారు.


రేవంత్ కి క్లాస్:


ఇక ఆరోహి, రేవంత్ గొడవ గురించి మాట్లాడారు నాగ్. 'గేమ్ లో ఆమెని ఎంకరేజ్ చేసి పంపించావ్.. ఆ తరువాత ఓడిపోయిన బాధలో ఆమె వస్తే అలా అనడం అవసరమా' అని రేవంత్‌ను అడిగారు నాగ్. దానికి రేవంత్ తనదే తప్పని ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆరోహి వచ్చి రేవంత్ కు సారీ చెబుతుంటే ఇద్దరు కామెంటేటర్లు మధ్యలో మాట్లాడడమేంటి? అని ప్రశ్నించారు. వారిద్దరికీ రివ్యూలు రివ్యూలు చెప్పి చెప్పి అలవాటైపోయింది అంటూ పరోక్షంగా ఆదిరెడ్డికి, గీతూకి చురకలు అంటించారు. సంచాలక్ గా ఫైమా బాగా ఆడిందని పొగిడారు నాగార్జున. 


ఆడియన్స్ సపోర్ట్ తప్పితే మరో సపోర్ట్ ఉండదు:
ఆర్జే సూర్య ఆటతీరుని ప్రశంసించారు నాగార్జున. చలాకీ చంటిని ఉద్దేశిస్తూ.. ఆ చలాకీతనం ఎక్కడుందని ప్రశ్నించారు నాగ్. అందరిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని నెక్స్ట్ వీక్ నుంచి మరింత యాక్టివ్ గా ఉంటానని చెప్పారు చంటి. శ్రీహాన్ తో ఇనయా గొడవ గురించి మాట్లాడారు నాగార్జున. 'బయట ఉన్నవాళ్ల పేర్లు నేను తీస్తే నీకేమైనా ఇబ్బందా..?' అని శ్రీహాన్ ను అడిగారు నాగార్జున. దానికి శ్రీహాన్.. 'బయటవాళ్ల సపోర్ట్ ఉందని చెప్పి ఇనయా మాట్లాడడం తనకు నచ్చలేదని' చెప్పారు. వెంటనే నాగ్.. హౌస్ మేట్స్ అందరినీ ఉద్దేశిస్తూ.. 'ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ తప్పితే మరో సపోర్ట్ ఉండదని' అన్నారు. 


ఇనయాకి నాగ్ సజెషన్:


ఇక ఆదిరెడ్డితో మాట్లాడుతూ 'ఆటాడుతున్నప్పుడు ఆటగాళ్లుంటారా? అంపైర్ ఉంటారా?' అడిగారు నాగార్జున. ఆటలో ఎంపైర్ మధ్యలో తిరుగుతుంటే ఉంటే ఎలా? అని అడిగారు. దానికి ఆదిరెడ్డి ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టగానే 'అంత ఆలోచించకు' అంటూ సెటైర్ వేశారు. ఆటలో ఆదిరెడ్డి ఇటూ అటూ తిరుగుతుండటాన్ని ప్రశ్నించారు నాగ్. ఇనయాను ఉద్దేశిస్తూ.. 'నీకు సంబంధం లేని విషయాల్లో దూరడం, అదే డిస్కషన్ మళ్లీ మళ్లీ పెట్టడం బాలేదు' అని చెప్పారు. రాజశేఖర్ ను బాగా ఆడాలని చెప్పారు నాగార్జున. గీతూ గేమ్ బాగానే ఆడుతుందని.. కానీ కొన్నిసార్లు నోరు జారుతుందని చెప్పారు నాగార్జున. 


శ్రీసత్య సేఫ్:


నామినేషన్స్ లో ఉన్నవారికి ఎన్విలాప్స్ ఇచ్చిన నాగార్జున.. అందులో రెడ్ ఇంక్ ఉంటే నాట్ సేఫ్ అని.. గ్రీన్ ఇంక్ ఉంటే సేఫ్ అని చెప్పారు. చంటి, ఇనయా, అభినయ శ్రీ, ఫైమా, రేవంత్, ఆరోహి అందరికీ రెడ్ ఇంక్ వచ్చింది. శ్రీసత్యకి మాత్రమే గ్రీన్ ఇంక్ రావడంతో ఆమె సేఫ్ అయ్యారు. 


ఎవరెవరికి ఏ కార్డు:


శ్రీసత్య హార్ట్ కార్డు కీర్తికి ఇచ్చి.. ఆమె పక్కన ఉంటే పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందని చెప్పారు. కీర్తి.. వెన్నుపోటు కార్డుని రేవంత్ కి ఇచ్చారు. రేవంత్ హార్ట్ సింబల్ కార్డుని శ్రీసత్యకి ఇస్తూ.. ఆమె ఉన్నది ఉన్నట్లుగా మారుతుందని చెప్పారు. నేహా.. కన్నింగ్ కార్డుని రేవంత్ కి ఇస్తూ.. తనకి కన్నింగ్ నేచర్ ఉందని చెప్పారు. ఆరోహి.. బ్లాక్ హార్ట్ ని మెరీనాకి ఇచ్చారు. శ్రీహాన్ కన్నింగ్ కార్డుని ఇనయాకు ఇచ్చారు. ఇనయా.. వెన్నుపోటు కార్డుని రేవంత్ కి ఇచ్చారు. చంటి.. తన దగ్గరున్న హార్ట్ సింబల్ ను సూర్యకి ఇచ్చారు. సూర్య.. జెలసీ కార్డుని ఆరోహికి ఇచ్చారు. ఫైమా.. ఫైటింగ్ కార్డుని రేవంత్ కి ఇచ్చారు. ఆదిరెడ్డి.. హార్ట్ సింబల్ ని రేవంత్ కి ఇచ్చారు. రాజశేఖర్.. ఫైటింగ్ కార్డుని గీతూకి ఇచ్చారు. గీతూ ఫైటింగ్ కార్డుని అభినయశ్రీకి ఇచ్చింది. వాసంతి కృష్ణన్.. వెన్నుపోటు కార్డుని షానికి ఇచ్చారు. షాని.. పంచ్ కార్డుని రేవంత్ కి ఇచ్చారు. అర్జున్ కళ్యాణ్.. కోల్డ్ హార్టెడ్ కార్డుని శ్రీసత్యకి ఇచ్చారు. గీతూకి కన్నింగ్ కార్డుని ఇచ్చారు బాలాదిత్య. మెరీనా-రోహిత్.. కన్నింగ్ కార్డుని గీతూకి ఇచ్చారు. ఫైనల్ గా వెన్నుపోటు బ్యాడ్జ్ ని రేవంత్ కి, కన్నింగ్ బ్యాడ్జ్ ను గీతూకి ఇచ్చారు. 


చంటి సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన ఆరుగురికి బాటిల్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. అందులో చంటి సేఫ్ అయ్యారు. ఇంకా నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే.. అభినయ శ్రీ, ఆరోహి, ఇనయా, రేవంత్, ఫైమా. 


Also Read : టాక్‌తో సంబంధం లేకుండా 'బ్రహ్మాస్త్ర' కలెక్షన్స్ - తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్


Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?