ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ICAR) యూజీ పరీక్షల అడ్మిట్‌కార్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబరు 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ను అందుబాటులో ఉంచింది. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలు సమర్పించి హాల్‌టికెట్లు పొందవచ్చు.
ICAR UG 2022 అడ్మిట్‌కార్డు డైరెక్ట్ లింక్..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 13 నుంచి ఐసీఏఆర్ యూజీ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేసింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌లో వివిధ డిగ్రీ, పీజీ, డాక్టరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబరు 13, 14 ,15 తేదీల్లో యూజీ పరీక్షలు జరుగనున్నాయి. అదేవిధంగా సెప్టెంబరు 20న పీజీ, పీహెచ్‌డీ పరీక్షలను కూడా ఎన్టీఏ నిర్వహించనుంది.
ఐసీఏఆర్ ఏఐఈఈఏ (ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్) యూజీ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. పీజీ, పీహెచ్‌డీ పరీక్షలను మాత్రం కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.
ICAR UG 2022 అడ్మిట్ కార్డు ఇలా పొందండి..
Step 1: అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- icar.nta.nic.in.
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Admit Card –ICAR (UG) 2022' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: లాగిన్ పేజీలో అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
Step 4: ICAR UG 2022 అడ్మిట్ కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శమిస్తుంది.
Step 5: భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవాలి.
Note: పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్‌కార్డులు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లడం ఉత్తమం.
యూజీ కోర్సులు..
1) బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
2) బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
3) బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ
4) బీఎఫ్‌ఎస్సీ
5) బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
6) బీఎస్సీ (ఆనర్స్) సెరికల్చర్
7) బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్
8) బీటెక్ డెయిరీ టెక్నాలజీ
9) బీటెక్ ఫుడ్ టెక్నాలజీ
10) బీటెక్ బయోటెక్నాలజీ
పీజీ కోర్సులు: ప్లాంట్ బయోటెక్నాలజీ, హార్టికల్చర్, ప్లాంట్ సైన్స్, ఫారెస్ట్రీ/ఆగ్రోఫారెస్ట్రీ/సిల్వికల్చర్, ఫిజికల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, వాటర్ సైన్స్ & టెక్నాలజీ, ఆగ్రోనమీ, హోంసైన్స్, సోషల్ సైన్స్, ఏనిమల్ బయోటెక్నాలజీ, స్టాటిస్టికల్ సైన్సెస్, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్సెస్, ఏనిమల్ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, ఫిషరీస్ సైన్సెస్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..