కోర్ట్ రూమ్ డ్రామా... తెలుగులో పెద్దగా సినిమాలు చేయని జానర్. గతంలో సావిత్రి, శ్రీదేవి, చిరంజీవి, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ తదితర స్టార్స్ నల్లకోటు వేసి కోర్టులో వాదించారు. అయితే... పోలీస్ క్యారెక్టర్లకు ఉన్నత ఫాలోయింగ్ లాయర్ క్యారెక్టర్లకు లేదని చెప్పాలి. అయితే... ఇప్పుడు డిఫరెంట్ జానర్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలనుకునే ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా వైపు చూస్తున్నట్లు ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'వకీల్ సాబ్', 'అల్లరి' నరేష్ 'నాంది'... గత ఏడాది తెలుగులో రెండు కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చాయి. ఆ రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఈ కోవలో మరో సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా వస్తుంది. ఆ సినిమా పేరు 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie).
చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'గీత సాక్షిగా'. చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రమిది. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే రాయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.
Geeta Sakshigaa Movie First Look : ఈ రోజు 'గీత సాక్షిగా' సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ విడుదల చేశారు. అవి చూస్తే... చిత్రా శుక్లా, శ్రీకాంత్ అయ్యంగార్ లాయర్ రోల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆదర్శ్ ఖైదీ పాత్ర చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారి ఎవరి నుంచో తప్పించుకోవడానికి ప్రయత్నించడం... ఆ చిన్నారిపై పెద్దల నీడ కనిపించడం వంటివి ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.
భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ
Also Read : 'హైపర్' ఆది ఈజ్ బ్యాక్ - 'జబర్దస్త్' రీ ఎంట్రీలో సుడిగాలి సుధీర్, రష్మీపై సెటైర్
శ్రీ విష్ణు 'మా అబ్బాయి', రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం', శ్రీ సింహా కోడూరి 'తెల్లవారితే గురువారం', 'అల్లరి' నరేష్ 'సిల్లీ ఫెలోస్' సినిమాల తర్వాత తెలుగులో చిత్రా శుక్లా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాలో ఆమె అతిథి పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలో ఆత్మహత్య చేసుకునే అమ్మాయిగా కనిపించారు. ఆమె 'ఉనికి' అని మరో సినిమా కూడా చేస్తున్నారు.
Also Read : సప్తగిరి కాళ్ళుకు దణ్ణం పెడతానన్న బాలకృష్ణ