Bigg Boss 6 Telugu: శనివారం ఎపిసోడ్ లో ఆడడం లేదంటూ తొమ్మిది మందికి గట్టిగా క్లాసు తీసుకున్నారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ‘తినడానికి పడుకోవడానికి ఇక్కడికి రావక్కర్లేదని, బయటికెళ్లి కూడా ఆ పని చేయవచ్చంటూ’ గట్టిగానే హెచ్చరించారు. ఆ ఎఫెక్ట్ బాగానే కనిపించింది. ఇప్పటి వరకు నోరు విప్పని వారు కూడా గట్టిగా తమ వాదనను వినిపించారు. అందులో మొదటి వ్యక్తి వాసంతి. నేహాను నామినేట్ చేసిన వాసంతి మొదటిసారి గట్టిగా మాట్లాడింది.నేహాపై ఓ రేంజ్ లో అరిచింది. నేహాను వాసంతి నామినేట్ చేయగా వారిద్దరి మధ్య వాదన సాగింది. నేహా తన స్థానం విడిచి వాసంతికి దగ్గరగా రాగానే ‘దిస్ ఈజ్ మై ప్లేస్’ అంటూ అరిచింది. ఇంతవరకు కామ్ గా ఉన్న ఈ పిల్లకి ఇంత వాయిస్ ఉందా అనిపించింది ప్రేక్షకులకు.
ఆదిరెడ్డి వాసంతిని నామినేట్ చేసినట్టు ప్రోమోలో చూపించారు. ఆదిరెడ్డి ‘నామినేట్ చేయడమంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కాదండి’ అన్నాడు. దానికి వాసంతి ‘నామినేషన్ అంటేనే ఇంట్లోంచి వెళ్లడమండి’ అంది. ఇక ఆదిరెడ్డి మొదట్నించి ఇనయాపై గొడవకు రెడీగా ఉన్నట్టే కనిపిస్తాడు. ఈసారి కూడా ఆమెనే నామినేట్ చేసి చాలా సేపు వాదించుకున్నారు. ఆ గొడవ హద్దులు దాటింది. ప్లేటు ఎత్తేస్తాను బిగ్ బాస్ అన్నాడు ఆదిరెడ్డి. తరువాత ఇనయాతో ‘నువ్వు ఇంత అరిస్తే, నేను అంత అరుస్తా’ అంటూ గొంతు చించుకున్నాడు. నేహా - గీతూ మధ్య మళ్లీ వాదన జరిగింది.
ఇక అర్జున్ తన స్నేహితుడు శ్రీహాన్‌ను నామినేట్ చేశాడు. ఇక మెరీనా- రోహిత్ కలిసి ఫైాను నామినేట్ చేశారు. తిరిగి ఫైమా కూడా వారినే నామినేట్ చేసింది. ‘తప్పు నామనేట్ చేశారు’ అంటూ రోహిత్ ను అంది. ఇక సూర్య, రేవంత్ కు నామినేషన్లలో కూడా క్లాసు తీసుకున్నాడు. ఎందుకు అనేది మాత్రం ఎపిసోడ్ లోనే చూడాలి.
కాగా ఈ వారం నామినేషన్లో పదిమంది ఉన్నట్టు సమాచారం.
1. చంటి
2. ఆరోహి
3. గీతూ
4. రేవంత్
5. ఇనయా
6. వాసంతి
7. ఆదిత్య
8. సుదీప
9. నేహ
10. శ్రీహాన్
మొదటివారం ఎలిమినేషన్ లేకుండా చేసిన బిగ్ బాస్, రెండో వారంలో మాత్రం డబుల్ ఎలిమినేషన్ చేశాడు. శనివారం షానీని, ఆదివారం అభినయశ్రీని ఎలిమినేట్ చేశారు. ఈసారి ఎలిమినేషన్లలో ఉన్న వారిలో వాసంతి వీక్ కంటెస్టెంట్ గా కనిపిస్తోంది. ఆమె మూడు వారాల్లో ఒక్కసారి కూడా ఆడినట్టు కనిపించలేదు. ఈ నామినేషన్లలోనే తొలిసారి కాస్త గట్టిగా మాట్లాడింది. బుట్టబొమ్మలో తయారవడం తప్ప ఆమె హౌస్ లో ఆడింది లేదు. అదే విషయాన్ని నాగార్జున కూడా ఆమెకు చెప్పారు.
Also read: మూడేళ్ల నుంచి పుట్టనిది ఇప్పుడు పుడుతుందా - సూర్య గురించి ఆరోహి, ప్రేమ ఉందన్న అభినయ