‘బిగ్ బాస్ 5’లో సోమవారం నామినేషన్ల రచ్చ మామోలుగా లేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. సభ్యులు చిన్న చిన్న కారణాలకే ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం కనిపిస్తోంది. రవి సోఫా మీద టవల్ ఆరబెట్టాడనే కారణం చెప్పి.. ప్రియా అతడిని నామినేట్ చేసింది. దీంతో ప్రియాంక.. సేఫ్ గేమ్స్ ఆడొద్దంటూ అరటి పండు విసిరి వెళ్లిపోవడం కనిపించింది. ప్రియా చెప్పిన చిన్న రీజన్‌కు తనని నామినేట్ చేయొద్దని రవి.. సన్నీని కోరడం ప్రోమోలో కనిపించింది. అయితే, అతడి మాట వినకుండా సన్నీ.. రవి ఫొటో ఉన్న కోతి బొమ్మను చెట్టు నుంచి తొలగించడం కనిపించింది. దీంతో ప్రియాంక ‘‘నేను ఫేక్ పీపుల్‌తో ఉండను’’ అని అరిచింది. ‘‘శ్వేత ఉండి ఉంటే.. తప్పకుండా నేను నామినేట్ చేసేవాడిని’’ అని సన్నీ.. రవితో అనడంతో.. ‘‘శ్వేత గురించి మాట్లాడకు సన్నీ’’ అని ఆనీ మాస్టర్ అనడం కనిపించింది. ‘‘శ్వేత నావల్లే వెళ్లిపోయిందా?’’ అని రవి ప్రశ్నించాడు. చివరిగా సన్నీ.. ‘‘ఇది నా నిర్ణయం’’ అన్నాడు. దీంతో ప్రియా ‘‘దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్’’ అనడం, సన్నీ ఆమె వైపు కోపంగా చూడటం ప్రోమోలో కనిపించింది. ‘‘గేమ్ మీరు ఆడొద్దు నేను ఆడతా. ఇది ఫైనల్’’ అన్నాడు. ఆ తర్వాత టిట్ ఫర్ టాట్ అంటూ రవిని సన్నీ నామినేట్ చేశాడు. ఈ డ్రామా మొత్తాన్ని లోబో సీక్రెట్ రూమ్ నుంచి వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
‘బిగ్ బాస్ 5’ తెలుగు ప్రోమో:
ఉదయం విడుదల చేసిన ప్రోమోలో..: ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని ప్రియాంక సింగ్ మండిపడింది. సన్నీ, శ్రీరామ్, జస్వంత్ వేటగాళ్లుగా కనిపిస్తున్నారు. వాళ్లు ఎవర్ని పట్టుకుంటే వారు...ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుందన్నట్టు అర్థమవుతోంది. ఈ ప్రాసెస్ లో సన్నీ-రవి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. షణ్ముక్... ఆనీ మాస్టర్ ని, సిరి...మానస్ ని, కాజల్...ప్రియని నామినేట్ చేశారు. అయితే మనల్ని ఎవరు చేస్తారో ఐడియా ఉంది..మనం ఎవర్ని నామినేట్ చేయాలో క్లారిటీ ఉందని ప్రియ-యానీ మధ్య చర్చ జరిగింది. వాస్తవానికి తనను నామినేట్ చేయడానికి రీజనే కనిపించడం లేదని నామినేట్ అయినబోర్డు వేసుకున్న సిరి..కాజల్ తో అంది. తనను నామినేట్ చేయడానికి రీజనే కనిపించడం లేదని సిరి కాజల్ తో అంది. గార్డెన్ ఏరియాలో చెట్టుకి కొతి బొమ్మలు వేలాడ దీసి వాటికి ఇంటి సభ్యుల ఫొటోలు తగిలించారు. నామినేట్ చేసిన వారు ఆ ఫొటోలను కట్ చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి