బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం ఐదో సీజన్  సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికే ఇంటి నుంచి నలుగురు సభ్యులు ఎలిమినేట్ కాగా ఈ వారం మరొకరి ఎలిమినేషన్ కి సమయం దగ్గరపడింది. అయితే ఎప్పటిలానే  ఈ షోలో మూవీ ప్రమోషన్స్ జోరు సాగుతోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ వేదికపై ఈరోజు ( శనివారం) కొండపొలం హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు క్రిష్  సందడి చేశారు.  దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసింది స్టార్ మా.



ప్రోమోలో ఏమందంటే... వైష్ణ‌వ్ ఇంత చిన్న వ‌య‌స్సులోనే ర‌కుల్‌ని ప్రేమించావా అని హోస్ట్ నాగార్జున అడగగా చేయాల్సి వచ్చిందని నవ్వుతూ బదులిచ్చాడు వైష్ణవ్. సినిమా ఎన్నిరోజుల్లో పూర్తైందని అడగ్గా 40 రోజులు అని క్రిష్ చెప్పడంతో మా వాళ్లు 105 రోజులు ఇక్కడుంటున్నారన్నారు నాగ్. అంటే 45 రోజుల్లో మనుషులు ఎలా మారుతారో...మారిపోతారో, జారిపోతారో అన్న నాగ్ మాటలను కంటిన్యూ చేస్తూ ఇంటిసభ్యురాలు ప్రియ పారిపోతారో అనగానే..గేట్స్ ఓపెన్ కావు ప్రియా అన్నారు.  బిగ్ బాస్ టైటిల్ ఇష్టమా -హమీదా ఇష్టమా అని శ్రీరామ్ ని క్వశ్చన్ చేయగా టైటిల్ ముఖ్యం అన్నాడు శ్రీరామ్. వెంటనే స్పందించిన క్రిష్ తానక్కడుంటే హమీదా ముఖ్యం అని చెప్పేవాడిని అంటూ నవ్వులు పూయించారు.   శ్రీరామ్ మనసులో మాట అదే అని కౌంటర్ వేసిన హోస్ట్.. టాస్క్ లో భాగంగా శ్రీరామ్ ప్రవర్తన, కిచెన్లో  శ్రీరామ్-జస్వంత్ మధ్య జరిగిన గొడవకు సంబంధించి గట్టిగానే మాట్లాడినట్టున్నారు. కొండపొలం టీం స్టేజ్ పై ఉన్నంత వరకూ షో సరదాగా సాగినా ఆతర్వాత మాత్రం ఇంటి సభ్యులకు గట్టిగానే క్లాస్ పడినట్టనిపిస్తోంది.
Also Read: షూటింగ్ లో గాయపడిన బాలకృష్ణ.. తగ్గేదే లే అంటూ ప్రోమో షూట్ పూర్తి చేసిన నటసింహం..!
మొదటి వారం సరయు,  రెండో వారంలో ఉమాదేవి, మూడో వారంలో లహరి,నాలుగోవారం నటరాజ్ ఎలిమినేట్ కాగా..ఐదో వారం ఇంటినుంచి ఎవరు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఏకంగా  తొమ్మిది మంది   లోబో, సన్నీ, ప్రియ, రవి, మానస్, విశ్వ, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, జస్వంత్ పడాల నామినేషన్లలో ఉన్నారు. అయితే అందరికన్నా తక్కువ ఓట్లు హమీద, విశ్వకి వచ్చినా  హౌస్ లో కంటెంట్ కోసం హమీదని ఉంచి విశ్వని పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఐదోవారం ఇంటినుంచి ఎవరు వెళతారన్నది ప్రస్తుతానికి హాట్ టాపిక్.


Also Read:  సమంత తల్లికావాలనుకుంది..కానీ ఆ ఒక్కనెలలో ఏం జరిగిందంటే..'శాకుంతలం' నిర్మాత షాకింగ్ కామెంట్స్
Also Read: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..
Also Read: కట్టప్ప తనయుడి ఫస్ట్ మూవీ టీజర్ విడుదల చేసిన బళ్లాల దేవ
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి