Balakrishna Talk Show: షూటింగ్ లో గాయపడిన బాలకృష్ణ.. తగ్గేదే లే అంటూ ప్రోమో షూట్ పూర్తి చేసిన నటసింహం..!

నందమూరి నటసింహం బాలకృష్ణ కాలికి గాయమైనట్టు టాక్. చిన్నగాయమే కంగారుపడాల్సిన అవసరం లేదని కూడా తెలుస్తోంది. ఇంతకీ గాయం ఎలా అయిందంటున్నారంటే...

Continues below advertisement

బాలకృష్ణ 'ఆహా' ఓటీటీ కోసం ఓ టాక్ షో ను చేయబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. కొందరు ఇదో రూమర్ అంటే మరికొందరు దీనిపై ఆసక్తి ప్రదర్శించారు. ఈ వార్తలు నిజమే అన్నది టాలీవుడ్ వర్గాల మాట. దర్శకుడు  క్రిష్ ఈ టాక్ షో కు పోగ్రాం ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నాడట. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ కి ఆహా వారు ఓటేశారట. ఇది నిజమో కాదో ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు కానీ అప్పుడే ఆహా టాక్ షో ప్రోమో షూట్ లో బాలకృష్ణ గాయపడ్డారంటూ వార్త హల్ చల్ చేస్తోంది. టాక్ షో కు సంబంధించిన ప్రోమో షూట్ చేస్తుండగా బాలయ్య కాలికి చిన్న గాయం అయ్యిందని అయినప్పటికీ తనపనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు. ఆహా వేదికగా ప్రారంభం కానున్న బాలకృష్ణ టాక్ షో ప్రోమోని దసరా సందర్భంగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ షో కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, వెంకటేష్, నాని ఇంకా పలువురు యంగ్ అండ్ సీనియర్ హీరోలను సంప్రదిస్తున్నారట. మొదటి సీజన్లో భాగంగా 10 నుంచి 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆహాలో బాలయ్య టాక్ షోకి గతంలో ఏ షో దక్కించుకోనంత హైప్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. 
Also read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
ఇక నటసింహం సినిమాల విషయానికొస్తే.. 'అఖండ' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ' సినిమాలో అఘోరగా కనిపించే సాహసం చేశారు. ఆ లుక్ కు సంబంధించి విడుదలైన టీజర్ అభిమానులను ఫిదా చేసింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా',' లెజెండ్' సూపర్ హిట్ అవడంతో 'అఖండ' పై భారీ అంచనాలే ఉన్నాయి.  ప్రస్తుతానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

Also Read:  సమంత తల్లికావాలనుకుంది..కానీ ఆ ఒక్కనెలలో ఏం జరిగిందంటే..'శాకుంతలం' నిర్మాత షాకింగ్ కామెంట్స్
Also Read: అఖిల్ కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఈవెంట్ లో చైతు..
Also Read: కట్టప్ప తనయుడి ఫస్ట్ మూవీ టీజర్ విడుదల చేసిన బళ్లాల దేవ
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement