బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న లహరి అతి తక్కువ సమయంలో హౌస్ నుంచి బయటకువెళ్లిపోయింది. ప్రియాతో గొడవ పెట్టుకున్న కారణంగానే ప్రేక్షకులు లహరిని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. బయటకొచ్చిన తరువాత ఈ బ్యూటీ కొన్ని అవకాశాలు వచ్చాయి. ఒకట్రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది. అలానే సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయట.

సోషల్ మీడియాలో అయితే ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ ఓ బైక్ ను కొనుక్కుంది. అది కూడా రూ.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బైక్ కావడం విశేషం. లహరి బైక్ లవర్ అనే సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 

ఇప్పుడు తన డ్రీం బైక్ ను సొంతం చేసుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ బ్యూటీ. ఫైనల్ గా ఈ బైక్ ను సొంతం చేసుకోగలిగాను అంటూ ఓ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. అలానే కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది. ఇది చూసిన యానీ మాస్టర్ రైడ్ కి తీసుకెళ్లమని కోరింది. దానికి ఓకే అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది లహరి. 

బైక్ మోడల్ -  BMW G 310 GS 

Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..

Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి