ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలని ఆశపడతారు. తమని పిల్లలు ప్రేమగా నాన్న అని పిలిస్తే వచ్చే ఆ సంతోషమే వేరు. ప్రస్తుతం అదే సంతోషాన్ని అనుభవిస్తున్నారు బిగ్ బాస్ ఫేమ్, నటుడు సామ్రాట్ రెడ్డి. ఆయన భార్య పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సామ్రాట్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తన కూతురి తొలి ఫోటోని పోస్ట్ చేశాడు. ఇది తనకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ చూసిన పలువు సెలబ్రెటీలు, ఫ్రెండ్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


కాకినాడకి చెందిన శ్రీ నిఖిత అనే అమ్మాయిని సామ్రాట్ 2020 నవంబర్ లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇంతకు ముందు హర్షితా రెడ్డి అనే యువతితో సామ్రాట్ కి వివాహం అయ్యింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుని దూరమయ్యారు. తర్వాత శ్రీ నిఖితని వివాహమాడారు. ఆగస్టు 15 న శ్రీ నిఖిత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది.


‘‘నా కూతురితో స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరుపుకోవడం డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తోంది. అవును మాకు ఆడపిల్ల పుట్టింది’’ అని తన కుమార్తెని ఎత్తుకున్న ఫోటోని సామ్రాట్ షేర్ చేశాడు. హీరో నాని హోస్ట్ చేసిన తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 2లో సామ్రాట్ పాల్గొన్నాడు. తన ఆటతో ఎంతో మంది అభిమనులని సంపాదించుకున్నాడు. ఆ సీజన్ లో కౌశల్ విజేతగా నిలిచాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సామ్రాట్ పలు సినిమాల్లో నటించాడు. ‘పంచాక్షరి’, ‘వైఫ్ ఆఫ్ రామ్’, ‘ఆహా నా పెళ్ళంట’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘దేనికైనా రెడీ’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాలో నటించాడు.


Also Read: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం


Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ