Bengaluru Man Works On Laptop Inside Movie Theatre: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. రకరకాల విన్యాసాలు, అరుదైన ఘటనలు చూసి నెటిజన్లు అబ్బుర పడతారు. సదరు వీడియోలు తెగ షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ బెంగళూరు యువకుడి వీడియో కూడా బాగా పాపులర్ అయ్యింది. అతడు థియేటర్ లో సినిమా చూస్తూ, మరోవైపు ల్యాప్ టాప్‌లో వర్క్ చేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వర్క్ ఫ్రం థియేటర్!
కరోనా అనంతరం చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని పని చేయడం బోర్ గా ఫీలై కొందరు తమకు నచ్చిన ప్రదేశాల్లో కూర్చొని ఆఫీస్ పని చక్కబెట్టుకుంటున్నారు. అలాగే బెంగళూరులో ఓ యువకుడు థియేటర్ లో సినిమా చూస్తూ తన పని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఓ వైపు సినిమా చూస్తూనే, మరోవైపు ల్యాప్ టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ కనిపించాడు. కేపీ ఆనే ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్వాగత్ ఓనిక్స్ థియేటర్ లో ఎర్లీ మార్నింగ్ షో చూడటానికి వెళ్లిన ఓ యువకుడు ఇలా ల్యాప్ టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడని రాసుకొచ్చాడు.
ఫన్నీగా స్పందిస్తున్న నెటిజన్లు
ఈ వీడియోపై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. కొందరు ఆ యువకుడి తీరును తప్పుబడుతుంటే, మరికొంత మంది మంది థియేటర్ లో కాకుండా పార్కులోనో, గార్డెన్ లోనో వర్క్ చేసుకుంటే బాగుండేదంటున్నారు. మరికొంత మంది ఏదో అత్యవసరమైన పని ఉండవచ్చని అతడిని సమర్థిస్తున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన కేపీ కూడా స్పందించాడు. “ఇది ఉదయం 4 గంటల షో. సినిమా అయ్యాక ఆఫీస్ కు లాగిన్ చేయడానికి ముందు కొన్ని మెయిల్ రిప్లైస్, లేదంటే పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తున్నట్లు ఉంది. నేను అలా అనుకుంటున్నాను. తను ఏం చేస్తున్నాడో నాకు తెలియదు” అని రాసుకొచ్చాడు.
నారాయణమూర్తి పైనా సటైర్లు
మరికొంత మంది ఈ వీడియోపై ఫన్నీగా స్పందిస్తున్నారు. “ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాని సూచించారు. ఆయన మాటను ఈ కుర్రాడు తూచ తప్పకుండా ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు. మిస్టర్ నారాయణ మూర్తి దీనిని చూస్తారని నేను ఆశిస్తున్నాను. అతడు చేస్తున్న పనిని మీరు అభినందించాలని కోరుకుంటున్నాను” అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మరికొంత మంది బెంగళూరులో టెక్కీ జీవితం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొద్ది రోజు క్రితం ఓ మహిళ బైక్ మీద వెళుతూ తన ల్యాప్ టాప్ లో పని చేస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది.
Read Also: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట