టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశారు. ఆయన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి వీరాభిమాని అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ పై ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. దేవర అంటూ పవన్ ని పిలుచుకుంటూ ఉంటారు బండ్ల గణేష్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్స్ వేశారు.
పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ ట్వీట్:
''నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్.. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్. మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే'' అంటూ పవన్ ను రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నారు. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమా చేస్తున్నారా..? అని బండ్లను ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'తీన్‌మార్', 'గబ్బర్ సింగ్' సినిమాలు నిర్మించారు బండ్ల గణేష్. మొన్నామధ్య బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తారని వార్తలొచ్చాయి కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ఊసే లేదు. ఇప్పట్లో వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ కూడా లేదనిపిస్తుంది.
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ముందుగా క్రిష్(Krish) దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు'(Harihara Veeramallu) సినిమా పూర్తి చేయాల్సివుంది. ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్'(Bhavadeeyudu Bhagath singh) సినిమా చేయాలి. ఇవి కాకుండా తమిళ రీమేక్ 'వినోదయ సీతమ్' కూడా పవన్ ఒప్పుకున్నారు. ఈ సినిమాలేవీ ఓ కొలిక్కి రాకముందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.
రాజకీయాల్లో పవన్ బిజీ..
రాజకీయాల్లో అయితే పవన్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మరింత నిమగ్నం కావాలని చూస్తున్నారు పవన్. ఎన్నికలు మొదలయ్యేలోపు మూడు నెలలు మాత్రమే సినిమాలకు కేటాయించాలని అనుకుంటున్నారు. ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. మరి ఈ మూడు నెలల్లో పవన్ తమిళ రీమేక్ ను పూర్తి చేస్తారని టాక్. అంటే మిగిలిన సినిమాలకు మరింత గ్యాప్ వస్తుందన్నమాట!
Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?