ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని భావించారు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. పలువురు ఈ సినిమాపై విమర్శలు చేశారు.  డైలాగ్స్‌ నుంచి వీఎఫ్‌ఎక్స్‌ వరకు అన్నింటిపైనా సినీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్‌ రివ్యూలే ఇస్తున్నారు.  నేపథ్యంలో తాజాగా మరో కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరుతున్నారు.


‘ఆదిపురుష్’నిషేధించాలని సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్


ప్రభాస్, కృతి సనన్ నటించిన పౌరాణిక ఇతిహాసానికి మరో తలనొప్పి ఎదురయ్యింది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ఈ సినిమాను నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఆదిపురుష్’ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని కోరింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ సినిమా రాకుండా నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని జోక్యం చేసుకోవాలిన అభ్యర్థించింది. అంతేకాదు, దర్శకుడు ఓ రౌత్ తో పాటు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర నిర్మాతలపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.


లేఖలో ప్రధానిని ఏం కోరారంటే?


“‘ఆదిపురుష్’ సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాముడు, హనుమంతుడిని కించపరిచేలా ఉన్నాయి.  ఈ సినిమా హిందువులు, సనాతన ధర్మం, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ప్రభు శ్రీరాముడు భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ దేవుడు. ఈ చిత్రంలో పలు డైలాగులు చాలా చౌకబారుగా ఉన్నాయి. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు ఒక వీడియో గేమ్ పాత్రలా కనించారు. రావణుడి గెటప్ కూడా చాలా దారుణంగా ఉంది. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి అవమానకరమైన సినిమాలో నటుడు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగం కావడం బాధాకరం. ‘ఆదిపురుష్’ సినిమా శ్రీరాముడు, రామాయణంపై మనకున్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాను తీసుకు వెళ్తోంది. అందుకే, ఈ సినిమాను వెంటనే నిషేధించడంతో పాటు చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలి” అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో రాసింది.






రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. కనీవినీ ఎరుగని అంచనాల నడుమ ఈ నెల 16న విడుదల అయ్యింది.  తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. సినిమా చాలా బాగుందని కొందరు చెప్తే, అస్సలు బాగాలేదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు . సినిమాపై మొదటి నుంచి ఉన్న భారీ అంచనాలను అందుకోవడం ఈ సినిమా విఫలం అయ్యింది. ప్రధానంగా పేలవమైన VFX, చవకైన డైలాగ్‌లు, రామాయణం ఇస్లాంమీకరణ సహా పలువు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మించింది. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించారు. చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి పాత్రను పోషించింది.  సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించాడు.


Read Also: చిరంజీవి ఇంట పుట్టింది సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ, మెగా ప్రిన్సెస్ జాతకంపై పండితుల అభిప్రాయం ఇదే!