Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Unstoppable with NBK season 2 Trailer : నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ నెల 4వ తేదీన విజయవాడ వెళ్ళనున్నారు. 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' సీజన్ 2 ట్రైలర్ అక్కడ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

Continues below advertisement

తెలుగు ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ టాక్ షో అంటే 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK) అని చెప్పాలి. నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ విధంగా ఉంటారా? అని ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన షో 'అన్‌స్టాప‌బుల్‌'. ఐఎండీబీలో టాక్ షో అన్నింటిలోనూ ఈ షో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ షో రెండో సీజన్ ప్రారంభానికి అంతా రెడీ అయ్యింది.

Continues below advertisement

అక్టోబర్ 4న... విజయవాడలో ట్రైలర్!
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సీజన్ 2 ట్రైలర్ అక్టోబర్ 4న విజయవాడలో విడుదల చేయనున్నట్లు 'ఆహా' ఓటీటీ ప్రతినిధులు తెలిపారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) లో చిలిపితనాన్ని, సరదా గుణాన్ని 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' (Unstoppable With NBK) బయటకు తీసుకు వచ్చింది. ఎవరూ చూడని విధంగా ప్రజెంట్ చేసింది. ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబును నందమూరి అభిమానులు, ప్రేక్షకులకు చూపించనున్నట్లు 'ఆహా' వర్గాలు తెలిపాయి.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో...
బాలకృష్ణ టాక్ షో ట్రైలర్ షూట్!
'ఆ!', 'జాంబీ రెడ్డి', 'కల్కి' చిత్రాలతో దర్శకుడిగా తన కంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు ప్రశాంత్ వర్మ. 'అన్‌స్టాప‌బుల్‌' సీజన్ 1 ప్రోమో షూట్‌కు ఆయన దర్శకత్వం వహించారు. ఇప్పుడీ 'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ సీజన్ ట్రైలర్, ప్రోమోను కూడా ఆయనే షూట్ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ''సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మళ్ళీ తప్పకుండా పని చేయాలని చాలా గట్టిగా అనుకున్నాను. రెండో సీజన్ ట్రైలర్ డైరెక్షన్ చేసే అవకాశం కూడా నాకు వచ్చింది. దీని కోసం ఆహా బృందం నన్ను సంప్రదించగా వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్య బాబుతో పని చేయడం అద్భుతంగా ఉంటుంది. అభిమానులకు నచ్చే విధంగా ఈ ట్రైలర్ కథ రాశా. అక్టోబర్ 4న విడుదలయ్యే ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందుని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

ఆల్రెడీ 'అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్' విడుదల చేశారు. 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2' టైటిల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీ అందించారు. యువ గాయకుడు, ర్యాపర్ రోల్ రైడ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు.

'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా...
డైలాగు వదిలితే మోగిపోద్ది బాడీ అంతా!
మాటలు తప్పుకొని వెళ్ళలేవు రాంగ్ వే...' అంటూ రోల్ రైడ ర్యాప్ స్టైల్‌లో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.     

ఈ పాట గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ''రోల్ రైడ, మహతి స్వర సాగర్ చేసిన యాంథమ్ నాకు ఎంతోగానో నచ్చింది. నా అభిమానులతో పాటు 'ఆహా' వీక్షకులు, ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని పేర్కొన్నారు. అక్టోబర్‌లో 'అన్‌స్టాప‌బుల్‌ 2' స్టార్ట్ కానున్నట్లు ఆహా ప్రతినిథులు పేర్కొన్నారు. ఈ షోలో ఎవరెవరు సందడి చేయనున్నారు? అనే ఆసక్తి వీక్షకులలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తదితరులు సందడి చేయనున్నట్లు సమాచారం.

Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Continues below advertisement
Sponsored Links by Taboola