నారి నారి నడుమ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డ్యాన్స్ చేస్తే? సాంగ్ సూపర్ హిట్టే! అందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఇప్పుడు మరోసారి ఆయన ఇరువురు భామల నడుమ డ్యాన్స్ చేశారు. ఒక వైపు హీరోయిన్ ఉంటే... మరో వైపు ఐటం బాంబ్ ఉన్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన వీరాభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి సినిమా వస్తోంది. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. ఇప్పుడు మూడో సాంగ్ వస్తోంది. అది ఎలా ఉంటుందో చూపించడానికి అన్నట్లు ఈ రోజు ప్రోమో విడుదల చేశారు.
మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి!
మనోభావాలు దెబ్బ తిన్నాయనే మాటలు ప్రేక్షకులకు తెలుసు. ఫలానా సినిమా లేదంటే వ్యక్తులు తమ మనోభావాలను కించపరిచారని కొందరు ఆందోళనలు చేయడం చూస్తుంటాం. 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' అంటూ కొత్త పాటతో వస్తున్నారు బాలకృష్ణ. శనివారం (డిసెంబర్ 24) మధ్యాహ్నం 3.19 గంటలకు సాంగ్ విడుదల చేయనున్నారు. ఈ రోజు ప్రోమో విడుదల చేశారు.
'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' పాటలో హీరోయిన్ హానీ రోజ్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవితో బాలకృష్ణ స్టెప్పులు వేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఆయన ఎప్పటిలా హుషారుగా స్టెప్పులు వేశారు. ఇద్దరు అందాల భామలకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. సినిమాలో ఇది స్పెషల్ సాంగ్ అని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని యూనిట్ టాక్.
లాస్ట్ సాంగ్ షూటింగులో బాలకృష్ణ
'వీర సింహా రెడ్డి'లో తొలి పాట 'జై బాలయ్య'కు మిశ్రమ స్పందన లభించింది. 'ఒసేయ్ రాములమ్మ' ట్యూన్ తరహాలో ఉందని చెప్పారు. రెండో పాట 'సుగుణ సుందరి'లో బాలకృష్ణ, శృతి హాసన్ మధ్య స్టెప్పులు అలరించాయి. ఇప్పుడు మూడో సాంగ్ విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. హీరో హీరోయిన్ల మీద కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో చిత్రీకరణ చేస్తున్నారు. దాంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : బాలకృష్ణను కలిసిన పవన్ కళ్యాణ్ - ఎక్కడంటే?
బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : నిర్మాతలు ఎలా ఒప్పుకొన్నారు? కళాతపస్వి సంచలన వ్యాఖ్యలు