నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాటల్లో ఫిల్టర్ ఉండదు. ఆయన మనసులో మరో ఉద్దేశం ఉండదు. ఏది అయినా సరే చాలా స్ట్రెయిట్‌గా చెప్పేస్తారు, స్ట్రెయిట్‌గా మాట్లాడతారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే? మామూలుగా ఉండదు. 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో చాలా సింపుల్‌గా సంక్లిష్టమైన ప్రశ్నలను అడుగుతున్నారు. సెలబ్రిటీలూ అంతే స్ట్రెయిట్‌గా సమాధానాలు ఇస్తున్నారు. 


'అన్‌స్టాపబుల్ 2' లేటెస్ట్ ఎపిసోడ్‌కు సీనియర్ హీరోయిన్లు జయప్రద, జయసుధ, ఈతరం అందాల భామ రాశీ ఖన్నా వచ్చారు కదా! వాళ్ళను బాలకృష్ణ కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి ప్రశ్నించారు. హీరోయిన్ల విషయంలో వినిపించే పుకార్లు, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు గురించి అడిగారు. అప్పుడు ఆ ముగ్గురూ ఏం చెప్పారు? అసలు బాలకృష్ణ ఏం అడిగారు? ఓసారి చదవండి!


ప్రశ్న: మహిళా ప్రాధాన్య చిత్రాలపై డబ్బులు పెట్టడానికి నిర్మాతలు వందసార్లు ఆలోచిస్తారు?
రాశీ ఖన్నా : నిజమే! ఇప్పుడు కూడా హీరోలు అందరికీ చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అమ్మాయిలకు ఫ్యాన్ బేస్ ఉంది. కానీ, నిర్మాతలు ఆలోచిస్తారు. ఇప్పుడు కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆడుతున్నాయి. అయినప్పటికీ ఆలోచిస్తారు. నిర్మాతలు ఆలోచిస్తారనేది నిజమేనని జయప్రద, జయసుధ అంగీకరించారు. 


ప్రశ్న: కథల విషయంలో హీరోయిన్లు సలహాలు ఇస్తే దర్శకులు హార్ట్ అవుతారు! నువ్వు మాకు కరెక్షన్ చెప్పడం ఏంటని!
అది అపోహ మాత్రమేనని ముగ్గురూ సమాధానం ఇచ్చారు. 'మిత్' అని స్పష్టం చేశారు. ఆ రోజుల్లో తాము సలహాలు ఇస్తే తీసుకుని కరెక్షన్స్ చేసేవారని జయప్రద తెలిపారు.
 
ప్రశ్న: హీరోయిన్లకు పెళ్ళైన తర్వాత తల్లి పాత్రలు ఇవ్వాలని చూస్తారు? నిజామా? అబద్ధమా?
హీరోయిన్లు ముగ్గురు ఈ ప్రశ్నకు ఒకే విధమైన సమాధానం చెప్పలేదు. అది నిజమేనని జయప్రద అన్నారు. అయితే, కొందరు అందుకు అతీతమని పేర్కొన్నారు. 


Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?


జయప్రద మాట్లాడుతూ ''హీరోయిన్ అనే కాన్సెప్ట్ మీద ప్రేక్షకులు, పరిశ్రమలో అభిప్రాయం మారుతుంది. కొంత మంది హీరోయిన్లకు మాత్రం పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు రావు. ఆ విషయంలో నేను లక్కీ. నాకు పెళ్ళైన తర్వాత ఇండస్ట్రీలో నా పని అయిపోయిందని అనుకున్నాను. కానీ, అలా ఎప్పుడు జరగలేదు. పెళ్ళి తర్వాత బిజీ అయ్యాను'' అని చెప్పారు. ''తెలుగు సూపర్ స్టార్ కాంటెస్ట్ ఒకటి పెడితే నాకు పెళ్ళైన తర్వాతే వచ్చింది. జయప్రద చెప్పినట్టు కొంత మంది హీరోయిన్లు పెళ్ళి తర్వాత అవకాశాలు అందుకున్నారు'' అని జయసుధ చెప్పారు. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా విధానం మారిందని, తమ తరం లక్కీ అని రాశీ ఖన్నా చెప్పారు. 


ప్రశ్న : ఆ రోజుల్లో అయినా, ఈ రోజుల్లోనైనా... హీరోయిన్ అవ్వాలంటే కొన్ని కాంప్రమైజ్‌లు తప్పవు! ఇది నిజమా? అబద్ధమా?
దీనికి ముగ్గురూ అబద్ధం (మిత్) అని సమాధానం ఇచ్చారు. ట్యాలెంట్ లేకపోతే ఎవరూ పైకి రాలేరని జయసుధ చెప్పారు. హీరోయిన్ ఓ స్థాయికి వచ్చారంటే ఏదో చేసి ఉంటారనే దురభిప్రాయం ఉందని, అది నిజం కాదని రాశీ ఖన్నా చెప్పారు. కాంట్రవర్షియల్ విషయాల్లో అగ్గిపుల్ల ఊదేసినట్టు ఊదేశారని ముగ్గురినీ బాలకృష్ణ అభినందించారు. 


Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!