దివ్య తన ఫ్రెండ్స్ ని తీసుకుని డాన్స్ ప్రాక్టీస్ చెయ్యడానికి ఇంటికి వస్తుంది. పరంధామయ్య వచ్చి వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తూ అందరూ సరదాగా ఉంటారు. సౌండ్ ఎక్కువగా ఉండటంతో లాస్య వచ్చి పాట ఆపేస్తుంది. ఎందుకు పాట ఆపేశావ్ అని దివ్య కోపంగా అడుగుతుంది.
లాస్య: ఇది ఇల్లా లేదంటే రికార్డింగ్ డాన్స్ స్టేజా
దివ్య: డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా కొంచెం ఓపిక పట్టొచ్చు కదా
లాస్య: ఇప్పటి వరకు ఓపిక పట్టాను అందుకే సైలెంట్ గా ఉన్నాను
దివ్య: లేకపోతే ఏం చేస్తావ్
పెద్దవాళ్ళు కూడా దానితో చేరి తైతక్కలాడటంటే ఇక బుద్ధి చెప్పేదేవరు అని లాస్య అరుస్తుంది. అప్పుడే నందు వచ్చి ఏమైందని అడుగుతాడు. ‘డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఒప్పుకున్నా కానీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేశారు, చెవుల్లో దూదులు పెట్టుకుని కూర్చున్నా కానీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని పిచ్చి గంతులు వేస్తున్నారు. నేను వచ్చి సౌండ్ తగ్గించాను అని నా మీద దివ్య అరుస్తుంది’ అని లాస్య ఎక్కిస్తుంది. దివ్య లాస్య మీద అరుస్తుంది. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని నందు సీరియస్ గా అనేసరికి అదే మాట ఆవిడకి కూడా చెప్పండని దివ్య ఎదురుతిరుగుతుంది. పెద్దవాళ్ళు మీరు ఇలా ఎగిరితే ఎలా అని తండ్రిని అనేసి వెళ్ళిపోతాడు.
Also Read: ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన రామా- అఖిల్ కి ఉద్యోగం ఇచ్చిన చరణ్
సామ్రాట్ కారులో వెళ్తు మళ్ళీ తులసి భజన మొదలెట్టేస్తాడు. తనని మరీ స్వామీజీని చెయ్యొద్దు అని తులసి అనేస్తుంది. ఇక దివ్య లాస్య చేసిన పనికి బాధపడుతూ ఉంటే అంకిత, శ్రుతి ఓదారుస్తూ ఉంటారు. తనని మీ ఫ్రెండ్స్ కి పిన్ని అని పరిచయం చేయలేదని ఉక్రోషంతో అలా చేసిందని అంకిత చెప్తుంది. మరి అదే చెప్పొచ్చు కదా సౌండ్ అని ఎందుకు గొడవ పెట్టుకుండాని దివ్య ఫీల్ అవుతుంది. ప్రేమ్, అభి వచ్చి ఏమైందని అడుగుతారు. దివ్య ఇంట్లో ఉండను వెళ్లిపోతాను, ఫ్రెండ్స్ అందరి ముందు అరిచింది తన పరువు పోయిందని బాధపడుతుంది. ఇంట్లో డాడ్ లేరా అని అభి అడిగాడు. ఉన్నారు కానీ వాళ్ళ ఆవిడకి సపోర్ట్ చేసి ఒక్క మాట అనకుండా వెళ్లిపోయారు అని దివ్య ఏడుస్తూ చెప్తుంది.
నందుకి జాబ్ కూడా లేదు కొంత కాలం ఎదురుచూద్దాం అని పరంధామయ్య చెప్తాడు. అలా చేస్తే నందు ముందు మనం చెడ్డ వాళ్ళం అవుతామని అనసూయ అంటుంది. అభి మాత్రం తాతయ్య మాట విందామని అంటాడు. నందుకి జాబ్ వస్తే పరిస్థితులు మారతాయి అప్పటి వరకు ఓపిక పడదామని పరంధామయ్య చెప్తాడు. తులసి దివ్య డాన్స్ ప్రాక్టీస్ ఎంత వరకు వచ్చిందో కనుక్కుందామని ఫోన్ చేస్తుంది. కానీ దివ్య చిరాకు మూడ్ లో ఉండి కాల్ కట్ చేస్తుంది. దివ్య చూసుకోకుండా కోపంగా కాల్ కట్ చేస్తూనే ఉన్న కూడా తులసి మళ్ళీ చేస్తుంది. తర్వాత చూసుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడిదాక వచ్చింది అంతా ఒకే కదా అడుగుతుంది. కన్నతల్లి ఉండి కూడా అనాథలా బతుకుతున్నా, అందరూ ఉండి కూడా ఒంటరిగా అనిపిస్తుందని దివ్య ఎమోషనల్ అవుతుంది.
Also Read: ముచ్చటగా మురిపిస్తున్న వేద, యష్ జంట- ఫుల్ ఖుషిలో సులోచన, మాలిని
పరంధామయ్య కడుపులో మంటతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తన బాధ చూసి అంకిత ఏమైందని అడుగుతుంది. విషయం తెలుసుకుని అంకిత కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిజ్ కి తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. తాళం తియ్యమని అంకిత శ్రుతిని అడుగుతుంది. తాళం తన దగ్గర లేదని ఇంట్లో ఎవరికి ఏం కావాలన్నా తననే అడిగి తీసుకోమని బెదిరించిందని శ్రుతి జరిగింది అంతా చెప్తుంది. లాస్య కిందకి వస్తుంటే అంకిత ఫ్రిజ్ కీస్ కావాలని అడుగుతుంది.