బాలకృష్ణ పేరు వింటేనే ఆయన అభిమానులకు పూనకాలు, ఇక అతని పవర్ ఫుల్ డైలాగులకు థియేటర్లు చప్పట్లు, ఈలలతో మారుమోగిపోవాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో డైలాగులంటే గుర్తొచ్చేది బాలయ్యే. ఎన్నేళ్లు గడిచినా ఆయన సినిమాల్లో మరిచిపోలేని డైలాగులు ఎన్నో. రైటర్స్, డైరెక్టర్స్ బాలయ్యను దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకంగా డైలాగులు రాస్తారు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డైలాగ్ పాపులర్ అయితీరుతుంది.బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అతని పవర్ ఫుల్ డైలాగుల చిట్టా ఇదిగో. ఇందులో మేము కొన్ని మర్చిపోయి ఉండవచ్చు. దయచేసి మీరు వాటిని కామెంట్ల రూపంలో యాడ్ చేయండి. 


1. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు - లెజెండ్


2. రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో... నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్ - లెజెండ్


3. ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే... శాసనం, దైవ శాసనం. - అఖండ


4. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే... షూటర్‌ని, కాల్చి పారేస్తా. - లెజెండ్


5. విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసరకూడదు. - అఖండ


6. ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. - లెజెండ్


7. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు - సమర సింహా రెడ్డి


8. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ, చరిత్రంటే మాదే. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయలన్నా మేమే. - సింహా


9. ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైమ్ నువ్వు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా - నరసింహనాయుడు


10. సరిహద్దులోనే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండాల మీద మా జెండాలు ఎగరేస్తాం - గౌతమి పుత్ర శాతకర్ణి


11. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం - గౌతమీ పుత్ర శాతకర్ణి. 


12. భగవద్గీత యుధ్దానికి ముందు వినిపిస్తుంది. నువ్వు మారకపోతే మళ్లీ చచ్చాక వినపడుతుంది. ఇప్పుడే వింటావా? చచ్చాక వింటావా? - లయన్


13. నరుకుతూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో. నాకు మాత్రం ఊపు వస్తుంది. -లెజెండ్


14. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకు పిండం పెడతాం... బోత్ ఆర్ నాట్ సేమ్ - అఖండ


13. నీకు బీపీ వస్తే నీ పీఏ వొణుకుతాడేమో. కాని నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. - లెజెండ్


14. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి ఓ అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపునా పుట్టడానికి మాత్రం కూతురు వద్దు - లెజెండ్


15. నీకు తిక్క రేగలేమో, నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది. -లెజెండ్


16. ఊరు మారితే పడుకునే బెడ్ మారుద్ది. తినే ఫుడ్ మారుద్ది. బ్లడ్ ఎందుకు మారుద్ది రా బ్లడీ ఫూల్. - లెజెండ్


17. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్‌ని... తొక్కి పార దొబ్బుతా - అఖండ



Also read: ప్రమోషనల్ సాంగ్‌కి స్టెప్పులేసిన హీరో నాని వైఫ్ అంజన, డ్యాన్సు ఇరగదీసిందిగా


Also read: నయనతార - విఘ్నేష్ పెళ్లికి హాజరైన షారూక్ ఖాన్, మరెంతో మంది టాప్ సెలెబ్రిటీలు