‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈలోపే చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్ చేస్తోంది. గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా రానున్నారు. కాగా చిత్రంలోని నటీనటులు కూడా తమదైన స్టైల్ లో చిత్రప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాని తన సతీమణితో అంజనాతో క్యూట్ గా స్టెప్పులేయించారు. సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కి నజ్రియా, అంజనా కలిసి మొదట స్టెప్పులేశారు. మధ్యలో నాని కూడా జత కలిసి మరింత స్టైల్ గా డ్యాన్సు చేశారు. ఇందులో నాని వైఫ్ అంజనా డ్యాన్సు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా చాలా బాగా డ్యాన్సు చేసింది. ఆమె డ్యాన్సు కోసమే ఆ వీడియోను పదేపదే చూస్తున్న వారు ఉన్నారు. నజ్రియా తన ఇన్ స్టా ఖాతాలో డ్యాన్సు వీడియోను పోస్టు చేసింది. హీరోయిన్ రేంజ్ డ్రెస్సింగ్ అయినా అంజనా ఇంత టాలెంట్ ఉందని నాని అభిమానులకు కూడా తెలియదు. 


ఆ ఓటీటీలో...
అంటే సుందరానికి సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న నజ్రియా ఫహాద్ తన ఇన్ స్టా ఖాతాలో తెలిపారు. గతంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు అంతా అనుకున్నారు, కానీ నెట్ ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కానుంది. ఎప్పటి నుంచో స్ట్రీమింగ్ కానుందో మాత్రం తెలియలేదు. సినిమా థియేటర్లోంచి వెళ్లాకే ఓటీటీ దర్శనమిస్తుంది. 


అంటే సుందరానికి సినిమాలో నాని, నజ్రియా జంటగా నటించారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నజ్రియా లీలాగా, నాని సుందర్ గా కనిపించనున్నారు. 





Also read: నయనతార - విఘ్నేష్ పెళ్లికి హాజరైన షారూక్ ఖాన్, మరెంతో మంది టాప్ సెలెబ్రిటీలు


Also read: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి