తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం (జూన్ 9) పదో తరగతి విద్యార్థుుల, తల్లిదండ్రులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ జూబ్ మీటింగ్‌లో ఉన్నట్టుండి వైసీపీ నేతలు కనిపించారు. ఒక్కో విద్యార్థికి మాట్లాడే అవకాశం కల్పిస్తుండగా, ఓ విద్యార్థి వంతు రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని సహా కొందరు ఆ మీటింగ్‌లో ప్రత్యక్షం అయ్యారు. దీంతో వెంటనే టీడీపీ లైవ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఆ మీటింగ్ ను కట్ చేశారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఎందుకిలా దొంగచాటుగా ఉన్నారని, డైరెక్ట్ గా వస్తే మాట్లాడతానని సవాలు విసిరారు.


అయితే, ఈ జూమ్ మీటింగ్ పదో తరగతి పిల్లలు హాజరు కాగా, వల్లభనేని వంశీ ఆఫీసులోని ల్యాప్ ట్యాప్ నుంచి ఓ విద్యార్థి హాజరయ్యాడు. అతని వంతు రాగానే తెరపై వల్లభనేని వంశీ ప్రత్యక్షం అయ్యారు. మరో వైసీపీ నేత కొడాలి నాని, దేవేందర్ రెడ్డి కూడా ఉండగా.. దేవేందర్ రెడ్డి నారా లోకేశ్ తో మాట్లాడేందుకు యత్నించారు. అయితే, ఈ లోపే నిర్వహకులు జూమ్ మీటింగ్ ను కట్ చేశారు. 


నేరుగా ఆ ప్రశ్నలు వేశాం - దేవేందర్ రెడ్డి


వైసీపీ నేత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు, నారా లోకేశ్ కు బురద రాజకీయం అలవాటు అయిందని విమర్శించారు. పదో తరగతి విద్యార్థులను కూడా పెయిడ్ ఆర్టిస్టులుగా రాజకీయాలకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే తాము కూడా జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి నేరుగా లోకేశ్ నే ఈ ప్రశ్న అడిగానని చెప్పారు. ఆయన మాట దాటవేశారని చెప్పారు.


జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నది టీడీపీ కార్యకర్తలేనని దేవేందర్ రెడ్డి కొట్టిపారేశారు. మీటింగ్ లో జాయిన్ వారంతా ముందుగా వారు ఇచ్చుకున్న స్క్రిప్టు ప్రకారం చెబుతున్నారని విమర్శించారు. ఆ మీటింగ్‌ ఓపెన్ అని, ఎవరైనా లింక్ ద్వారా జాయిన్ కావచ్చని తెలిపారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని తాను వేర్వేరుగా జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినట్లుగా చెప్పారు. స్క్రీన్ పైన వల్లభనేని, కొడాలి నాని కనిపించగానే వారు మీటింగ్ ని కట్ చేశారని అన్నారు.