స్పీడుగా సినిమాలు చేయడం నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్టైల్. ఒక్కసారి ఆయన కమిట్ అయ్యారంటే... వెనక్కి తిరిగి చూసేది ఉండదు. చకచకా సినిమా పూర్తి చేస్తారు. గత ఏడాది చివర్లో 'అఖండ'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి, ఆ తర్వాత కూడా ఆ సినిమా థియేటర్లలో ఆడింది. దాని తర్వాత రెండు సినిమాలకు బాలకృష్ణ ఓకే చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. మరో సినిమాను నవంబర్‌లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారట.  


నవంబర్‌లో సెట్స్ మీదకు NBK 108!
బాలకృష్ణ కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. బాక్సాఫీస్ బరిలో వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ చిత్రానికి దర్శకుడు. బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట! 


ముందు అన్‌స్టాప‌బుల్‌...
తర్వాత ఎన్‌బీకే 108!
గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కోసం ఆగస్టు నెలాఖరులో బాలకృష్ణ టర్కీ వెళ్లారు. ఇస్తాంబుల్‌లో శృతి హాసన్‌తో ఒక పాట, విలన్లతో ఒక ఫైట్, కొన్ని కామెడీ సీన్లు చేశారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత 'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ సీజన్ కోసం టీజర్, ట్రైలర్ షూటింగ్ చేశారు. త్వరలో ఎపిసోడ్స్ షూటింగ్ కూడా చేస్తారట. అవి పూర్తయిన తర్వాత ఎన్‌బీకే 108 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు అనిల్ రావిపూడి కూడా సినిమాను స్పీడుగా కంప్లీట్ చేస్తారు. ఇద్దరి స్పీడుకు సినిమా త్వరగా కంప్లీట్ కావచ్చు.


Also Read : Adipurush Poster Copied : 'ఆదిపురుష్' పోస్టర్ కాపీనా? - సిగ్గుచేటు అంటోన్న యానిమేషన్ స్టూడియో



తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. కుమార్తెగా 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) నటించనున్నారు. మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్, క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్‌గా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 


అన్‌స్టాప‌బుల్‌ ట్రైలర్ & యాంథమ్‌కు సూపర్ రెస్పాన్స్!
ఇటీవల 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్ విడుదల చేశారు. విజయవాడలో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రోగ్రాం కూడా చేశారు. దానికి కొన్ని రోజుల ముందు 'అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్' విడుదల చేశారు. ఆ రెండిటికీ మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో బాలకృష్ణ గెటప్, ఆ లుక్ ఇండియానా జోన్స్ తరహాలో ఉందని కాంప్లిమెంట్స్ వినిపించాయి.  


'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2' టైటిల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీ అందించారు. యువ గాయకుడు, ర్యాపర్ రోల్ రైడ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. 'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా... డైలాగు వదిలితే మోగిపోద్ది బాడీ అంతా! మాటలు తప్పుకొని వెళ్ళలేవు రాంగ్ వే...' అంటూ రోల్ రైడ ర్యాప్ స్టైల్‌లో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 


Also Read : Godfather Box Office : 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?