గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ నెల మూడో వారంలో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి.


తారక రత్న కోసం... బాలకృష్ణ వాయిదా!
నిజం చెప్పాలంటే... జనవరి నెలాఖరున లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారని తెలిసింది. నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున కుప్పంలో పాల్గొన్న బాలకృష్ణ ఆ తర్వాత హైదరాబాద్ రావాలని ప్లాన్ చేశారట. తారక రత్నకు గుండెపోటు రావడంతో అనూహ్యంగా ఆయన షెడ్యూల్ మారింది. కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఆర్టిస్టుల డేట్స్ అవీ చూసుకుని ఈ నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.   


ఎన్‌బికె 108లో బాలకృష్ణ
నందమూరి అందగాడితో తెలుగు తెర చందమామ జోడీ కడుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో బాలకృష్ణది సింగిల్ క్యారెక్టర్ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినప్పటికీ... డ్యూయల్ షేడ్స్ ఉంటుందని టాక్. అంటే... యంగ్ వెర్షన్ కూడా ఉంటుందట. యంగ్ బాలయ్యకు జోడీగా కాజల్ కనిపించే అవకాశం ఉంది. 


బాలకృష్ణతో కాజల్ తొలి చిత్రమిది!
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది. 


ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108 వర్కింగ్ టైటిల్ పెట్టారు. డిసెంబర్ నెలాఖరులో సినిమా కోసం వేసిన భారీ జైలు సెట్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఫైట్స్ తీశారు. 


Also Read : తారక రత్న ఆరోగ్యంపై ఎన్టీఆర్ సైలెన్స్


ఈ సినిమాలో నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కూడా ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగులో ఆయన కూడా పాల్గొన్నారు. తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్.  బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి', లేటెస్ట్ మాస్ మహారాజా రవితేజ హిట్ 'ధమాకా' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. అయితే, ఆమె ఎవరి కుమార్తెగా నటిస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.  


బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్!
ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... లేటెస్ట్ హ్యాట్రిక్ ఇది.


Also Read : తెలుగింటి కోడలు కాబోతున్న లావణ్యా త్రిపాఠి - ఆ హీరోతో పెళ్లి!