ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చాలా మందికి ఉన్న ఆలోచన ఇదే. ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లి ఉంటే జస్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీలో హ్యాపీస్ గా వెళ్లిపోవచ్చు. కానీ అలా జరగలేదు RRR విషయంలో. RRRను జనరల్ క్యాటగిరీలో సబ్మిట్ చేశారు. అలా ఎలా చేశారు? పర్మిషన్ ఎవరు ఇస్తారు? అసలు ఆస్కార్స్ ఇచ్చే అకాడమీ ఎలాంటి రూల్స్ పెడుతోంది సినిమాలు తీసుకోవాటనికి. ఆస్కార్స్ సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ ఇలాంటి సందేహాలు చాలా మంది ఫిల్మ్ లవర్స్ లో ఉన్నాయి. అందుకే RRR ఆస్కార్స్ జర్నీను దగ్గర ఉండి మెంటార్ చేస్తున్న బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ...తనకు తెలిసిన విషయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇప్పుడు అవేంటో పాయింట్స్ వైజ్ చూద్దాం.


1. ఎలిజిబులిటీ..యూఎస్ లో మొత్తం ఆరు అకాడమీ క్వాలిఫైడ్ మెట్రో ఏరియాస్ ఉన్నాయి. ఆ ఆరు ప్లేసుల్లో ఏదో ఒకచోట ఓ కమర్షియల్ మోషన్ పిక్చర్ థియేటర్ లో వరుసగా ఏడు రోజులు సినిమా ఆడాలి. దాన్ని థియేటర్ క్వాలిఫైయింగ్ రన్ అంటారు. ఇది కచ్చితంగా కంప్లీట్ చేస్తేనే ఆస్కార్స్ కు సబ్మిట్ చేసుకోవటానికి ఎలిజబుల్ అవుతాం.


2. ఈ ఏడు రోజులు ఆడటంలో కూడా మళ్లీ రూల్స్ ఉంటాయి. రోజుకు కచ్చితంగా మూడు షోలు పడాలి. వాటిలో ఒక షో సాయంత్రం 6 గంటల 10 గంటల మధ్యలో ఉండాలి. ప్రైమ్ టైమ్ అంటారు దీన్ని. థియేటర్లు ఎక్కువ మంది వచ్చే టైం ఇది. సో అలాంటి టైమ్ లో బొమ్మ కచ్చితంగా పడాలి. జనరల్ క్యాటగిరీలో సినిమాను సబ్మిట్ చేయాలంటే ఈ రూల్ ను ఆ సినిమా తప్పకుండా ఫాలో కావాల్సిందే.


3. ఇలా ఎలిజిబులిటీ రూల్ ను ఫాలో అయ్యి ఆస్కార్స్ కు జనరల్ క్యాటగిరీలో సబ్మిట్ అయిన సినిమాలు ఈ ఏడాది 300లకు పైగానే ఉన్నాయి. ఇండియా నుంచి కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. RRR, కాంతారా, గంగూబాయి ఖతియావాడీ, కశ్మీర్ పైల్స్, రాకెట్రీ, విక్రాంతో రోణా అబ్బో లిస్ట్ పెద్దదే ఈ సారి.


4. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సినిమాలు లిస్ట్ ఈ ఏడాది 300 లకు పైగా ఉన్నాయి అన్నాం కదా. దీన్ని రిమైండర్ లిస్ట్ అంటారు. ఆస్కార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీ తప్ప ఏ విభాగంలోలైనా ఇవి పోటీపడొచ్చు. 


5. ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీలో ఎందుకు సబ్మిట్ చేయకూడదు అంటే ఈ విభాగానికి ఆ యా దేశాల నుంచి అఫీషియల్ ఎంట్రీలుగా సినిమాలు వస్తాయి. ఈ సారి 80 కి పైగా దేశాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీకి తమ దేశాల నుంచి ఎంట్రీలను పంపించాయి. ఇండియా నుంచి ఛెల్లో షో అనే సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసి పంపించింది. 


6. ఇప్పుడు అన్ని సబ్మిషన్లు అయిపోయాక వచ్చిన సినిమాల్లో నుంచి 10 క్యాటగిరీలకు అకాడమీ...షార్ట్ లిస్ట్ లను అనౌన్స్ చేస్తుంది. Documentary Feature Film(15 films), Documentary Short (15), International Feature (15), Makeup &Hairstyling(10), Music(Original Score)(15), (Original Song) (15), Animated Short  (15), Live Action Short (15),Sound (10), VFX(10 సినిమాలను షార్ట్ చేస్తుంది.


7. డిసెంబర్ 21న ఈ షార్ట్ లిస్ట్ లను ప్రకటించింది అకాడమీ. ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR నాటు నాటు సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీలో షార్ట్ లిస్ట్ పదిహేను సినిమాల్లో ఛెల్లో షో ఉంది. ఇంకా డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా ఆస్కార్స్ కు షార్ట్ లిస్ట్ అయ్యింది. 



8. జనవరి 24 వ తారీఖున అన్ని క్యాటగిరీలకు ఐదేసి సినిమాల చొప్పున ఫైనల్ నామినేషన్లు అనౌన్స్ చేస్తారు. అంటే బెస్ట్ యాక్టర్ కోసం ఐదు సినిమాలు, బెస్ట్ డైరెక్టర్ కోసం ఐదు సినిమాలు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అలా...కానీ బెస్ట్ ఫిల్మ్  కి మాత్రం 10 సినిమాలను అనౌన్స్ చేస్తారు. సో ఇదంతా జనవరి 24న చేసే ఫైనల్ నామినేషన్స్ తో క్లారిటీ వచ్చేస్తుంది


9. ఈ ఫైనల్ నామినేషన్ల మీద అకాడమీలో ని లైఫ్ టైమ్ మెంబర్లు, యాక్టివ్ మెంబర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆయా క్యాటగిరీల్లో ఏది ఆస్కార్ అందుకునే స్థాయి ఉన్న సినిమానో తమ తమ ఓట్లు వేసి చెబుతారు. 


10. సో అకాడమీ సభ్యుల తుది నిర్ణయం ప్రకారం ఆస్కార్స్ అందుకునే విజేతలు ఎవరో ఫైనల్ డే స్టేజ్ మీద ప్రటిస్తారు. అది కూడా ఓ క్లోజ్డ్ ఎనవలెప్ లో తెచ్చి స్టేజ్ మీద చదువుతారు. 


ఇది మ్యాటర్ ఆస్కార్ అవార్డ్ అందుకోవాలంటే ఇంత ప్రాసెస్ నడుస్తుంది. ఇన్ని రూల్స్ దాటుకుని ఇప్పుడు RRR కావచ్చు మరేదైనా భారతీయ సినిమా కావచ్చు ఆస్కార్ తీసుకువచ్చి ఇండియా పేరు మారు మోగిస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. మళ్లీ చెబుతున్నా ఆస్కార్ కొట్టమండే పీజీ ప్యాసైనంత వీజీ కాదు.