Avika gor: ‘బాలికా వధు’ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అవికా గోర్. ఇదే సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’ పేరుతో ప్రసారం అయ్యింది. తెలుగు బుల్లితెర అభిమానులను అవికా తన క్యూట్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోయిన్ గా తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాతో తెలుగు సినీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో ‘వధువు’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో నందు, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ఈ సిరీస్ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సందర్భంగా అవికా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి- అవికా
‘వధువు’ వెబ్ సిరీస్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందినట్లు వెల్లడించింది అవికా గోర్. ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని చెప్పింది. బెంగాలీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులో ‘వధువు’గా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీని ఎప్పుడూ వినలేదని చెప్పింది. బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన కంటెంట్ ఇందులో ఉంటుందని వివరించింది. కేవలం 10 సంవత్సరాల వయసులో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ లో నటించానన్న అవికా, అప్పటికి పెళ్లంటే ఏంటో తనకు తెలియదని వెల్లడించింది. ‘వధువు’ పేరుతో కథ వినగానే ‘చిన్నారి పెళ్లికూతురు’ గుర్తొచ్చినట్లు తెలిపింది. ఈ థ్రిల్లర్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చెప్పింది.
20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటా- అవికా
ఇక తనకు పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది అవికా గోర్. సీరియల్స్, సినిమాల్లో ఇప్పటి వకు 20 సార్లకు పైగా పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పింది.’ చిన్నారి పెళ్లి కూతురు’లో నటించడం వల్ల విషయాలు తెలుసుకున్నట్లు తెలిపింది. ‘వధువు’ కోసం పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చాలా సీన్లలో నేచురల్ గా నటించినట్లు చెప్పింది. తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి చాలా సంతోషించారని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తెలుగులో ఆది సాయి కుమార్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు అవికా గోర్ వెల్లడించింది. హిందీలోనూ కొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు తెలిపింది. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉందని వెల్లడించింది. ఈ మధ్య తన దగ్గరికి ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ కథలు వస్తున్నట్లు వివరించింది. మంచి ప్రేమ కథలు కూడా చేయాలని ఉందని చెప్పింది. నటిగా భిన్న కథలతో తెరకెక్కే సినిమాలు చేయాలనుందని తెలిపింది.
Read Also: టీ-సిరీస్ అధినేతకు బిగ్ రిలీఫ్, అత్యాచారం కేసును ఎత్తివేసిన న్యాయస్థానం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply