తెలుగు సినిమా చరిత్రలో అరుంధతి సినిమా తనకంటూ ఓ పేజీని రాసుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా. అనుష్కను విమెన్ ఓరియంటెడ్ హీరోయిన్‌గా నిలబెట్టిన మూవీ. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై తిరుగులేని రికార్డులు రాసింది. ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలను అందుకుంది. ఈ సినిమా ద్వారానే సోనూసూద్ లోని అసలైన నటుడిని గుర్తించింది పరిశ్రమ. పశుపతి పాత్రతో ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు సోనూ సూద్. ఈ సినిమాను మూడు నాలుగు సార్లు చూసిన వారు ఎంతోమంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ వస్తే... సిని అభిమానులకు కన్నుల పండుగే. కానీ ఇంతవరకు అరుంధతికి సీక్వెల్ తీసే ఉద్దేశం ఎవరికీ రాలేదు. 


ఫేన్‌మేడ్ వీడియో...
డార్క్ క్లౌడ్ స్లూడియో అనే యూట్యూబ్ ఛానెల్ అరుంధతి సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందో ఓ ట్రైలర్ విడుదల చేశారు. దాన్ని ఇప్పటి వరకు 26 లక్షల మంది చూశారు. నిజంగానే అరుంధతి పార్ట్ 2 వస్తుందేమో అన్న ఆనందంతో ‘ఈ సినిమా కోసం మేము ఎంతో వేచి ఉన్నాం’ అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ట్రైలర్ చూస్తే నిజంగానే అరుంధతి పార్ట్ 2 వస్తుందేమో అనుకుంటారు ఎవరైనా. ఆ స్థాయిలో ఉంది ట్రైలర్. తమ డిజిటల్ క్రియేటివిటీతో ఈ అందమైన, ఆసక్తికరమైన ట్రైలర్ ను రూపొందించారు డార్క్ క్లౌడ్ స్టూడియో వారు. చూసి మీరూ ఆనందించండి.  



అనుష్క కన్నా ముందు అరుంధతి పాత్ర కోసం మమతా మోహన్ దాస్‌ను సంప్రదించారు. కానీ ఆమె సినిమా ఎక్కువ కాలం షూటింగ్ జరిగే అవకాశం ఉందన్న ఆలోచనతో నిరాకరించింది. విక్రమార్కుడు షూటింగ్ లో ఉన్న అనుష్కకు అవకాశం దక్కింది. రాజమౌళి సలహాతో ఆమె సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అరుంధతి సినిమా అనుష్క సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 


Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: దేశానికి సర్పంచ్ ఏంట్రా? సోగాళ్ళ హంగామా... యాక్షన్ అదిరిందిగా!


Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!


Also Read: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడ‌క్ష‌న్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి