'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటినుంచి 'ఆవకాయ్ సీజన్'లో తమ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ చెబుతూ వస్తోంది. ఒకేసారి ఏడు విడుదల తేదీలు ప్రకటించి అందరినీ స‌ర్‌ప్రైజ్ చేసిన ఈ టీమ్ ఫైనల్ గా జూన్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.


దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంది. నైజాంలో రూ.10 కోట్లు, సీడెడ్ లో రూ. 4 కోట్లు, ఆంధ్రలో రూ.10 కోట్లు  ఇలా మొత్తం రూ.24 కోట్ల బిజినెస్ జరిగింది. 


కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.2.50 కోట్లు కాగా.. ఓవర్సీస్ లో రూ.3.50 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. అంటే మొత్తంగా ఈ సినిమా రూ.30 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే అంతకుమించి కలెక్షన్స్ రాబట్టాలి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'మేజర్', 'విక్రమ్' సినిమాలు దూసుకుపోతున్నాయి. నాని సినిమా వాటిని డామినేట్ చేస్తుందేమో చూడాలి!


Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ


Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?