నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్నారు. రేపు (ఫిబ్రవరి 24న) నాని పుట్టినరోజు (Nani Birthday Special). ఆయన అభిమానులకు ఒక్కరోజు ముందుగానే నిర్మాణ సంస్థ బహుమతి ఇచ్చింది. నాని పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే బ్లాస్ట్ (SundarBarthhdayBlast) పేరుతో ఒక వీడియో టీజర్ విడుదల చేసింది. (Ante Sundaraniki Movie Nani Birthday Homam Out Now)

 

'అంటే సుందరానికి' మూవీ బర్త్ డే హోమం టీజర్ చూస్తే... గండాలు ఉండటంతో ఇంట్లో పూజాలు విపరీతంగా చేయించడంతో విసుగు చెందే కుర్రాడిగా నాని కనిపించారు. ఈ బర్త్ డే హోమం టీజ‌ర్‌తో పాటు సినిమా విడుదల తేదీ కూడా చెప్పేశారు. జూన్ 10న 'అంటే సుందరానికి' (Ante Sundaraniki Movie Release Date) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు తెలిపారు. నానితో పాటు సినిమాలో ఆయన తల్లిగా నటించిన రోహిణి... నరేష్ వీకే, 30 ఇయర్స్ పృథ్వీ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కనిపించారు. 





 


నాని సరసన మలయాళ భామ నజ్రియా నజిమ్ (Nazriya Nazim In Ante Sundaraniki Movie) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వేసవి కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందునుంచి 'ఆవకాయ్ సీజన్'లో తమ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ చెబుతూ వస్తోంది. అయితే... ప్రతి సినిమా విడుదల తేదీలు మారుతున్న తరుణంలో ఒకేసారి ఏడు విడుదల తేదీలు ప్రకటించి 'అంటే సుందరానికి' టీమ్ అందరిని స‌ర్‌ప్రైజ్ చేసింది.