'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' (Ant-Man and the Wasp : Quantumania)... మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో వస్తున్న 31వ సినిమా. 'యాంట్ మ్యాన్', 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దానికి తోడు మార్వెల్ బ్రాండ్. అందువల్ల, 'యాంట్ మ్యాన్ 3' (Ant Man 3) మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే, అమెరికాలో పడిన ప్రీమియర్ షోలు అభిమానుల అంచనాల మీద నీళ్ళు చల్లాయి. ఈ సినిమాకు విపరీతంగా నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
మార్వెల్ చరిత్రలో రెండో చెత్త సినిమా!
Ant-Man 3 becomes second rotten film in MCU : సినిమా చూసిన తర్వాత 'రొట్టెన్ టమాటోస్ సైట్'లో ప్రేక్షకులు రివ్యూలు ఇస్తూ ఉంటారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాల్లో 'యాంట్ మ్యాన్ 3' రెండో చెత్త సినిమాగా రికార్డులకు ఎక్కింది. సినిమా బాలేదని పలువురు పేర్కొన్నారు. దాంతో విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. దీని కంటే ముందు... మొదటి స్థానంలో 'ఎటర్నల్స్' చెత్త సినిమాగా రికార్డులకు ఎక్కింది.
విలన్‌కు ఓటేశారు...
సినిమా బాలేదన్నారు!
'యాంట్ మ్యాన్ 3'లోనూ టైటిల్ పాత్రలో పాల్ రూడ్ (Paul Rudd) నటించారు. స్కాట్ లాంగ్‌గానూ ఆయన కనిపించనున్నారు. హోప్ వాన్ డీన్, వాస్ప్ పాత్రలో ఎవాంజలీన్ లీ నటించారు. విలన్ కింగ్ ది కాంకరర్ పాత్రలో నటించిన జోనాథన్ మేజర్స్ (Jonathan Majors) నటించారు.
'యాంట్ మ్యాన్ 3' చూసిన చాలా మంది విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్రలో జోనాథన్ మేజర్స్ బాగా నటించాడని పేర్కొంటున్నారు. ఆయనకు ఓటు వేశారు. కానీ, సినిమా బాలేదని పేర్కొంటున్నారు. విలన్ యాక్టింగ్ ఒక్కటే బావుందని కొందరు పేర్కొనడం గమనార్హం.
ఆ ఫన్ ఎక్కడ?
ఎమోషన్ ఏది??
విలన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ... ఆ పాత్రలో జోనాథన్ మెజర్స్ బాగా చేసినప్పటికీ... సినిమాలో కామెడీ మిస్ అయ్యిందని సినిమా చూసిన వాళ్ళలో మెజారిటీ జనాలు చెప్పే మాట. 'యాంట్ మ్యాన్' ఒకటి, రెండు సినిమాల్లో ఫన్, హ్యూమర్ 'యాంట్ మ్యాన్ 3'లో లేదని చెబుతున్నారు. ఎమోషన్ కూడా మిస్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. ఏదో త్వరగా సినిమాను ముగించిన ఫీలింగ్ కలిగిందని కొందరు పేర్కొన్నారు.
Also Read : లావణ్యా త్రిపాఠి 'పులి - మేక'కు రామ్ చరణ్ సాయం... అదేంటో తెలుసా?
బ్యాడ్ రివ్యూస్ పక్కన పెడితే... మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించారని కొందరు విమర్శలు చెబుతున్నారు. అమెరికాతో పాటు ఇండియాలో 'యాంట్ మ్యాన్ 3' రేపు (ఫిబ్రవరి 17, శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి భారతీయ ప్రేక్షకులు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బావున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో సేల్ అయిన టికెట్స్ నంబర్ చూస్తే ఎవరైనా సరే ఆ విషయాన్ని ఈజీగా చెబుతారు.
Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?
పీవీఆర్, సినీ పోలీస్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫిబ్రవరి 17న బుకింగ్స్ చూస్తే... 'యాంట్ మ్యాన్ 3' టికెట్స్ 43,907 సేల్ అయ్యాయి. ఇది మంగళవారం ఉదయానికి! రోజు రోజుకూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారతీయ ప్రేక్షకుల ముందుకు 'యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ : క్వాన్టుమేనియా' వస్తోంది.