సీఐడీ అదికారులు నోటీసులు జారీ చేయటంతో వరుసగా రెండో సారి చింతకాలయ విజయ్ గుంటూరు సీఐడీ పోలీసులు వద్ద హజరు అయ్యేందుకు విజయవాడకు వచ్చారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు బుద్దా వెంకన్న తన అనుచురులతో కలసి విజయవాడ నుంచి గుంటూరుకు బయల్దేరారు. ఈ సందర్భంగా తెలుగు దేశం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర ప్రారంభం కావడంతో పిచ్చి కుక్కలను రోడ్ల మీదకు జగన్ వదిలారని కామెంట్‌ చేశారు. కొడాలి నాని, ఇతరులను చంద్రబాబు, లోకేష్‌పై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. గుడివాడలో జేబులు కొట్టేసే నాని చంద్రబాబును తిట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. వాళ్లంతా దగ చేసే వాళ్లు కాబట్టే అందరినీ అలాగే అనుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.


కొడాలి ఉల్లిపాయ పకోడి....


మాజీ మంత్రి, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నానిని ఉద్దేశించి బుద్దా వెంకన్న ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఉల్లిపాయ పకోడి అయిన కొడాలి నాని... చంద్రబాబు, వాళ్ల నాన్న పేరు ఎందుకంటూ ప్రశ్నించారు. కొడాలి నాని ఎప్పుడైనా తన తండ్రి పేరు ఏంటో చెప్పారా అని అన్నారు. ఎన్టీఆర్‌కు కొడాలి నాని వారసుడినని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకేష్ వారసుడు కాదా... నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు.. ఎలా వారసుడివి అంటూ కొడాలి నాని ఉద్దేశించి బుద్దా వెంకన్న అన్నారు. ఉల్లిపాయ పకోడి కొడాలి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తాము కూడా జగన్మోహన్ రెడ్డిని అనగలమని, మహా అయితే అరెస్టు చేస్తారు.. లేదా చంపేస్తారు అంతేగా అన్నారు. 


కోటంరెడ్డిని కామెంట్ చేసే అర్హత లేదు...


కోటం రెడ్డి ఎప్పటి నుంచో జగన్ వెంట ఉన్నారని, ఆయన బాధ కలిగి మాట్లాడారని అయితే, కోటం రెడ్డిని అనే అర్హత కూడా కొడాలి నానికి లేదన్నారు. గుడివాడలో హరికృష్ణకి ఎన్నికల ఏజెంట్‌ గా కొడాలి నాని పని చేసిన విషయం మరచిపోయారా అని వ్యాఖ్యానించారు. అప్పుడు హరికృష్ణ నాలుగో స్థానంలో ఉన్నారంటే కొడాలి నాని వెన్నుపోటు పొడిచినట్లే అని ఆరోపించారు. కొడాలి నాని మరలా ఇరవై వేల ఓట్లతో గెలవటం అసాధ్యమని,ఈసారి ప్రజలు తరిమి కొడతారని అన్నారు.


వైఎస్ కుటుంబంలో కొడాలి చిచ్చు...


వివేకానంద హత్య కేసుపై తెలుగు దేశం పార్టీ కేవలం అనుమానాలు వ్యక్తం చేసిందని, అయితే ఈ పకోడి కొడాలి నాని, వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టారని అన్నారు. తమ్ముడు తన కన్నా గొప్ప అని గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. జగన్‌కు ఏంటి లాభం అన్నారంటే.. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కొడాలికి ఎమి తెలుసో చెప్పాలన్నారు. ఆస్తి, పదవి వస్తుందంటే, జగన్‌ చంపేస్తారని కొడాలి నాని చెబుతున్నారా అని ప్రశ్నించారు.


కమ్మ కోటాలో వైసీపీ వర్కిగ్ ప్రెసిడెంట్...


కమ్మవారి కోటాలో‌ వైసిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలని కొడాలి నాని ఉవ్వళ్ళూరుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. కమ్మ కోటాలో ఎమ్మెల్యే, మంత్రి కావాలి కానీ తిట్టేది మాత్రం కమ్మ కులాన్నేనని విమర్శించారు. గుడివాడ ప్రజలు నానీని రాళ్లతో కొట్టి చంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, జైలు వెళ్లి జగన్‌ని కలిసి డీల్ మాట్లాడుకుంటే టిడిపి సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. వైసిపి కోసం మొదటి నుంచి పని చేస్తున్న వారు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలన్నారు.