బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చెల్లెలు, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూతురు అన్షులా కపూర్ చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా మీ డౌట్.. ,కెమెరా ముందు తన ఇన్నర్ ను తీస్తూ వీడియో చిత్రీకరించింది. ఒక హీరో చెల్లెలు ఇలా ఎందుకు చేసిందని అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వస్తే.. సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలు కావొచ్చు, సామాన్యులు కావొచ్చు.. వారి ఫ్రెండ్స్ ను, సన్నిహితులను ట్యాగ్ చేస్తూ ఏదొక ఛాలెంజ్ చేస్తుంటారు.
దానికి వారు రియాక్ట్ అవుతూ.. ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అలానే ఇప్పుడు 'నో బ్రా క్లబ్' అనే ఛాలెంజ్ జరుగుతుంది. ఇందులో మహిళలు పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కెమెరా ముందు నుంచొని తన టాప్ లో నుంచి 'బ్రా'ను తొలగించి ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
దీనిపై నెటిజన్లు తమైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ వీడియోపై స్పందిస్తూ 'ఎవ్రీడే' అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోపై కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు మాత్రం ఘాటు విమర్శలు చేస్తున్నారు. కెమెరా ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.