అందాల ముద్దుగుమ్మ అంజలి తెలుగు అమ్మాయి అయినా, తమిళ సినిమా పరిశ్రమలోనే సత్తా చాటింది. తెలుగులో అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నా.. కోలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈ అమ్మడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెడుతోంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికగా స్ట్రీమ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఈ నెల 20న విడుదల కాబోతున్నట్లు తొలుత ప్రకటించినా, కొన్ని కారణాలతో ఈ నెల 27కు మార్చారు. ఈ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.
డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సీరిస్‌లకు కూడా బాగానే ప్రజాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ లు చేసేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు మొగ్గు చూపుతున్నారు. ఇదే బాటలో నడుస్తున్న తెలుగమ్మాయి అంజలి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఏకంగా మూడు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అందులో ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ విడుదలకు రెడీ అయ్యింది. ఈ నెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. పూర్తిగా యాక్షన్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నది. తన ఎనిమీస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఓ మహిళా పోలీస్ అధికారి ఎదుర్కొనే ఇబ్బందుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలితో పాటు చాందిని చౌదరి మరో కీ రోల్ పోషిస్తోంది. అటు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.
మరో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్న అంజలి
ఇక అంజలి మిగతా వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే ’ బహిష్కరణ’, ‘ఫాల్’ లో నటిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది సినిమాలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది . తన ఒంపు సొంపులతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలోనూ కీలక పాత్ర చేసి మెప్పించింది. ఇక అంజలి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ హీరోగా ‘చాణక్య’ అనే సినిమాను తెరకెక్కించారు తిరు. ఆయన తొలిసారిగా ఈ వెబ్ సిరీస్ నే డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు యాక్టర్ కృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.