సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) తెలుగులో హిట్ సినిమాలు చేశారు. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన 'కనులు కనులను దోచాయంటే' సినిమాలకు ఆయనే సంగీతం అందించారు. 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో నార్త్ ఇండియన్ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకున్నారు. అయితే... 2023లో సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' హర్షవర్ధన్ రామేశ్వర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరి, 2024లో ఆయన నుంచి ఏ సినిమా రాబోతుంది?


విరాజ్ అశ్విన్, సుహాస్ హీరోలుగా 'శ్రీ రంగ నీతులు'
'బేబీ' సినిమాతో గత ఏడాది భారీ విజయం అందుకున్న హీరో విరాజ్ అశ్విన్. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న'లో ఒక పాత్రలో తళుక్కున మెరిశారు. యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న మరో నటుడు సుహాస్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి కొత్త సినిమా చేస్తున్నారు.  


విరాజ్ అశ్విన్, సుహాస్ హీరోలుగా రూపొందుతున్న సినిమా 'శ్రీ రంగ నీతులు'. 'కేరాఫ్ కంచరపాలెం', 'నారప్ప' సినిమాల ఫేమ్ కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నారు. 'చిలసౌ', 'హిట్' సినిమాల హీరోయిన్ రహానీ శర్మ మరొక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 'యానిమల్', 'డెవిల్' సినిమాలతో 2023కి వీడ్కోలు పలికిన ఆయన నుంచి 2024లో వస్తున్న మొదటి సినిమా ఇది. 


జ‌న‌వ‌రి 5న 'శ్రీ‌ రంగ‌ నీతులు' టీజ‌ర్
'శ్రీ‌ రంగ నీతులు' చిత్రానికి ప్ర‌వీణ్‌ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. ఈ చిత్రాన్ని రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు స్టార్ట్ చేశారు. జ‌న‌వ‌రి 5న టీజర్ విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు.


Also Readయాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?


'శ్రీరంగనీతులు' టీజర్ విడుదల కానున్న సందర్భంగా ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ... ''ఈత‌రం యువ‌త, వారి ఆలోచ‌న‌లతో పాటు ఎమోష‌న్స్‌ ఏ విధంగా ఉంటున్నాయి? అనేది సినిమాలో మూడు పాత్రల ద్వారా చూపిస్తున్నాం. యువత జీవితంలోని కీలకమైన దశలను ఆస‌క్తిక‌ర‌మైన కథ‌, కథ‌నాల‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేలో చూపించే ప్ర‌య‌త్నం చేశాం. కొత్త‌ద‌నంతో పాటు పూర్తి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో రూపొందించిన హైపర్ లింక్ డ్రామా ఇది. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రి ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. సినిమాలో క్యారెక్టర్లు అందరికీ కనెక్ట్ అవుతాయి'' అని అన్నారు. ''మోడ్రన్ సెన్సిబిలిటీస్‌తో అంద‌రికి న‌చ్చే విధంగా దర్శకుడు ప్రవీణ్ కుమార్ వి.ఎస్.ఎస్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌''ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టీజో టామీ, సంగీతం: హ‌ర్షవ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌ & అజ‌య్ అర‌సాడ‌, కూర్పు: శ‌శాంక్ ఉప్ప‌టూరి.


Also Readఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?