టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తుంది. ఈ రిజల్ట్ ఎవరూ ఊహించలేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం పూరిని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కథలో సత్తా లేదని.. విజయ్ కష్టమంతా వృథా అయిపోయిందని తెగ ఫీలైపోతున్నారు. కానీ కొందరు మాత్రం 'లైగర్' ఫ్లాప్ టాక్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. 


ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితం యాంకర్ అనసూయ(Anasuya) ట్విట్టర్ లో 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!' అంటూ కామెంట్ చేసింది. ఇది విజయ్ దేవరకొండని ఉద్దేశించి చేసిన కామెంటే అంటూ నెటిజన్లు అంటున్నారు. విజయ్ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ సమయంలో అనసూయ ఆ సినిమాకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేసింది. 


అమ్మను తిడుతూ సినిమాలో ఉన్న బూతు డైలాగ్స్ పై ఫైర్ అయింది. దీని గురించి టీవీ ఛానెల్స్ తో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అప్పట్లో దీనిపై స్పందించిన విజయ్.. అటెన్షన్ కోసం చేసే పనులే ఇవన్నీ అంటూ అనసూయను ఉద్దేశిస్తూ అన్నారు. అప్పటినుంచి అనసూయకి విజయ్ దేవరకొండకి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. మధ్యలో విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమాలో అనసూయ నటించడంతో అంతా సద్దుమణిగిందని అందరూ భావించారు. 


కానీ తాజాగా ఆమె వేసిన ట్వీట్ చూస్తుంటే.. అనసూయ ఇంకా అప్పటి సంగతులు మర్చిపోలేదని అనిపిస్తుంది. ఈ ట్వీట్ పై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 'చరిత్రే చెబుతోంది కదా మేడం!! ఆడబిడ్డల జోలికి వస్తే పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయ్!! మనమెంత!!' అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. చాలా మంది మాత్రం విజయ్ ని సపోర్ట్ చేస్తూ అనసూయని తిట్టిపోస్తున్నారు. 






Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?



Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి


'లైగర్' గురించి ఎవరేం చెబుతున్నారు? అనేది పక్కన పెడితే... మీమ్ మేకర్స్, ట్రోలర్స్ మాత్రం ఎటాక్ స్టార్ట్ చేశారు. సినిమా అసలేం బాలేదని ఘంటాపథంగా చెబుతున్నారు. విమర్శల్లో క్రియేటివిటీ చూపిస్తూ విజయ్ దేవరకొండ అండ్ 'లైగర్' చిత్ర బృందం మీద ఎటాక్ స్టార్ట్ చేశారు.


'లైగర్'లో చాలా మంది పతాక సన్నివేశాలు నచ్చలేదు. ఇంకా క్లైమాక్స్ ఉందని అనుకుంటే... సడన్‌గా ఎండ్ కార్డ్స్ వేశారు. ఆ విషయం మీద మీమర్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. అదేం క్లైమాక్స్ అని క్వశ్చన్ చేస్తున్నారు. 'లైగర్'తో విజయ్ దేవరకొండకు పూరి జగన్నాథ్ పెద్ద దెబ్బ కొట్టారని కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.