నందమూరి సోదరులు కళ్యాణ్ రామ్ (Kalyan Ram), ఎన్టీఆర్ (NTR Jr)... ఇద్దరినీ ఒకే వేదిక మీద చూడొచ్చు. వీళ్ళ కలయికకు హైదరాబాద్‌లోని జేఆర్సీ వేదిక కానుంది. ఆదివారం అన్నదమ్ములు ఇద్దరూ 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయనున్నారు. 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. 


నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'అమిగోస్' (Amigos Telugu Movie). ఇందులో ఆషికా రంగనాథ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.   


కర్నూలులో శుక్రవారం 'అమిగోస్' ట్రైలర్ విడుదల చేశారు. కళ్యాణ్ చేసిన ట్రిపుల్ రోల్ చేయగా... ఆ ముగ్గురిలో ఒకరు ఇండియన్ పాబ్లో ఎస్కోబార్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అతడు మిగతా ఇద్దరినీ చంపేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకు? అనేది సస్పెన్స్. సినిమాలో చూడాలి. 'రాక్షసుడిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టావ్ కదరా!' అని ముగ్గురిలో ఒకడిని తండ్రి తిడతాడు. 'మనం బ్రదర్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు' అని తనలా ఉన్న మరో ఇద్దరిపై డెవిల్ లాంటి పాబ్లో ఎస్కోబార్ ఎందుకు దాడి చేశాడు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.


Also Read : 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?


''నేను ఎవరినీ బెదిరించను. ఐ జస్ట్ కిల్'' అని చివరిలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్... ముగ్గురిలో మృగం లాంటి ఒకరి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసింది. ''మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే అరిష్టం'' అనే డైలాగ్ కథలో ఇంకేదో ఉందనే హింట్ ఇస్తోంది. ''అలా చూస్తున్నావ్ ఏంట్రా!? ''సోమాలియా కరువు బాధితుడిలా ఆ ఆకలి చూపులు ఏంట్రా? తినేస్తావా ఆ పిల్లను'' అని బ్రహ్మాజీ అడగటం చూస్తుంటే... కామెడీ, రొమాంటిక్ ట్రాక్ కూడా ఉందని అనిపిస్తోంది. 


Also Read : దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!


ఎన్నో రాత్రులు... రెస్పాన్స్ సూపరు!
'అమిగోస్' సినిమాలో రెండు పాటలు విడుదల చేశారు. తొలి పాట 'యెక యెక...'లో ముగ్గురు హీరోల మధ్య ఫ్రెండ్షిప్ ఆవిష్కరించారు. రెండో పాట బాలకృష్ణ 'ధర్మ క్షేత్రం'లో 'ఎన్నో రాత్రులు వస్తాయి...' రీమిక్స్. ఆ వీడియోకి రెస్పాన్స్ బావుంది.   


బడ్జెట్ అంతా నాన్ థియేట్రికల్ రైట్స్‌తో!
ఆల్రెడీ 'అమిగోస్' నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారని తెలిసింది. వాటితో బడ్జెట్ రికవరీ అయ్యిందని సమాచారం. 'బింబిసార' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ, శాటిలైట్ ఛానల్స్ 'అమిగోస్'ను తీసుకున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ హక్కులను తొమ్మిది కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ... భారీ విజయాలు అందుకుంది. అంతే కాదు... ఆ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా లాభాలు అందుకున్నాయి.


'అమిగోస్' చిత్రానికి కూర్పు : త‌మ్మిరాజు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : అవినాష్ కొల్ల‌, నృత్యాలు : శోభి, ఫైట్ మాస్ట‌ర్స్: వెంక‌ట్, రామ్ కిష‌న్‌, పాట‌లు:  'స్వ‌ర్గీయ' శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి, రెహ‌మాన్‌, ఛాయాగ్రహణం : ఎస్‌. సౌంద‌ర్ రాజ‌న్, సి.ఇ.ఓ :  చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హ‌రి తుమ్మ‌ల‌, సంగీతం : జిబ్రాన్.