బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 9 వారాలు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్లు మిగిలారు. చక్కటి ఆటతీరుతో వీళ్లంతా ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ ఇప్పుడిప్పుడే మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తల్లి తాజాగా ఓ వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఆట తీరు గురించి, అమర్ దీప్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.  


శివాజీ ఎందుకు అలా అన్నారో అర్థం కావట్లేదు


రీసెంట్ గా అమర్ దీప్ ను నమ్మొద్దంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై అమర్ తల్లి రియాక్ట్ అయ్యింది. ఆయనకు అమర్ అంత ద్రోహం ఏం చేశాడో అర్థం కావట్లేదన్నది. ఆయన మాకు ఏమైనా బంధువా? నమ్మించి ఆయన ఆస్తులు ఏమైనా అమర్ రాయించుకున్నాడా? అని క్వశ్చన్ చేసింది. హౌస్ లో పెద్దాయన అయి ఉండి అలా మాట్లాడ్డం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పింది. ఇకపై అలా మాట్లాడరని భావిస్తున్నట్లు వెల్లడించింది. నిజానికి అమర్ కు  శివాజీ సపోర్టు బాగానే ఉందని చెప్పిన ఆమె, అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడింది.


అమర్ ను కంటి చూపుతో కంట్రోల్ చేస్తున్న ప్రియాంక


ఇక మరో కంటెస్టెంట్ ప్రియాంకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమర్ తల్లి. అమర్ ను హౌస్ లో ప్రియాంక కంటి చూపుతో కంట్రోల్ చేస్తుందని వెల్లడించింది. అయితే, తను అలా కంట్రోల్ చేయడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చని చెప్పింది. అమర్ గెలవాలనే ఉద్దేశంతోనే తను అలా చేసి ఉండవచ్చు అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరి ఆట తీరు చాలా బాగుందని చెప్పింది.


బాగా మెరుగు పడిన  అమర్ దీప్ ఆటతీరు


ఇక గత ఎపిసోడ్లతో పోల్చితే అమర్ ఆట తీరు చాలా బాగుందని చెప్పింది. ఇప్పటి వరకు నెక్ట్స్ వీక్ బాగా ఆడతాను, నెక్ట్స్ వీక్ బాగా ఆడతాను అని అమర్ అంటుంటే, ప్రతివారం ఇదే చెప్తున్నావు కానీ, నీ గేమ్ అనేది కనిపించడం లేదని నాగార్జున అనేవారని, ఇప్పుడు అమర్ ఆట తీరు కనిపిస్తుందని వెల్లడించింది. ఇక ముందు మంచి ఆట తీరు కనబరుస్తాడని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది.


ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా


ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి అమర్ దీప్ మీద సోషల్ మీడియాలో కొంత మంది దాడి చేస్తున్నారని ఆరోపించింది. కొంత కాలం పాటు ఓపిక పట్టానని, ఆ తర్వాత తనలో ఓపిక నశించి పోయిందని చెప్పింది. అందుకే వారిపై కౌంటర్ వీడియోలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఎదుటి వారిపై విమర్శలు చేయడంలో తప్పులేదన్న ఆమె, హద్దులు మీరి ప్రవర్తించకూడదని వెల్లడించింది.


Read Also: రామ్ చరణ్ సినిమాలో అర్జున్​ కీలకపాత్ర.. భోళే అన్న అట-శోభ ఆంటీ అట, ఫన్నీగా సాగిన ప్రోమో