అల్లు శిరీష్ (Allu Sirish)... కథానాయకుడిగా ఆయన ప్రయాణం మిగతా హీరోల కంటే భిన్నమైనది. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంటారు. అందుకే, తక్కువ సినిమాలు చేస్తుంటారు. డిఫరెంట్ సబ్జెక్టులు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మూడేళ్ళ విరామం తర్వాత థియేటర్లలోకి రావడానికి ఆయన రెడీ అయ్యారు.
నవంబర్‌లో శిరీష్ కొత్త సినిమా విడుదల!
అల్లు శిరీష్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా నిర్మించింది. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ 4న (Allu Sirish New Movie Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు నేడు వెల్లడించారు. త్వరలో టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
'ప్రేమ కాదంట' పేరు మారుతుందా?
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మరొక నిర్మాణ సంస్థతో కలిసి జీఏ 2 పిక్చర్స్ ఒక సినిమా రూపొందింది. ఆ మధ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) టైటిల్‌తో వచ్చిన ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకుడు. అప్పట్లో రెండు ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు కూడా! ఇప్పుడు ఆ సినిమా పేరు మార్చి కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు సమాచారం.
మూడేళ్ళ తర్వాత థియేటర్లలోకి వస్తున్న శిరీష్!
అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఎబిసిడి' సినిమా మే, 2019లో విడుదల అయ్యింది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమాతో రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్ళ తర్వాత మళ్ళీ శిరీష్ థియేటర్లలోకి వస్తున్నారు.
Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?
శిరీష్ కెరీర్ చూస్తే... 'గౌరవం' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదల అయ్యింది. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్‌తో '1971 : బియాండ్ బోర్డర్స్' సినిమా చేశారు.
Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?