‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అల్లు అర్జున్. టాలీవుడ్ లో సత్తా చాటిన ఈ ఐకాన్ స్టార్, త్వరలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. షారుఖ్ ఖాన్- అట్లీ కాంబోలో తెరెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘జవాన్’తో హిందీ వెండితెరపై దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో అథితి పాత్ర కోసం బన్నీకి ఆఫర్ వచ్చినట్లు సమాచారం.


‘జవాన్‘లో అతిథి పాత్రలో మెరవనున్న అల్లు అర్జున్?


సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ క్రేజ్ ను యూజ్ చేసుకోవాలని అట్లీ భావిస్తున్నాడు. అల్లు అర్జున్ కు సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ ‘జవాన్’ సినిమాకు ఉపయోగపడుతుంది ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ సినిమాలో పూర్తి స్థాయి క్యారెక్టర్ కాకుండా కేవలం అతిథి పాత్రకే అల్లు అర్జున్ పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ‘జవాన్’ చిత్రంలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో నయన్ కూడా బాలీవుడ్ లోకి తొలిసారి అడుగు పెడుతోంది.  ‘జవాన్’ సినిమాతో దర్శకుడు అట్లీ సైతం బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు.  ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కూడా క్యామియో రోల్ లో మెరవనున్నారు. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.






పుష్ప2’ షూటింగ్ లో బన్నీ బిజీ బిజీ


ప్రస్తుతం అల్లు అర్జున్ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. సుమారు 18 రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండో భాగం ‘పుష్ప2’ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగంతో పోల్చితే రెండో భాగంలో మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారట. ‘పుష్ప’ అద్భుత విజయం సాధించడంతో ‘పుష్ప2’ పై అభిమానుల్లో ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అంచనాలకు మించి ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.  ఫహద్ ఫాసిల్, సునీల్, అనుసూయ భరద్వాజ్ తదితరులు నటించారు. రెండో భాగంలోనూ వీరంతా కంటిన్యూ అవుతున్నారు.  






Read Also: షారుఖ్‌కు ముద్దు పెట్టిన నయనతార, ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?