స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కువైంది. మొన్నామధ్య ఈ సినిమాలో 'దాక్కో దాక్కో మేక' పాటను రిలీజ్ చేసే సమయంలో ఓ వీడియో బయటకొచ్చింది. ఒరిజినల్ వెర్షన్ కాకుండా దేవిశ్రీప్రసాద్ పాడిన ఫుల్ పాట బయటకొచ్చేసింది. ఆ సమయంలో విషయం కేసుల వరకు వెళ్లింది. తాజాగా మరోసారి ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫుటేజ్ బయటకొచ్చింది.
Also Read: ‘శ్రీకాంత్ జాగ్రత్త.. నా కళ్ల ముందు హీరో అయ్యావు’.. నరేష్ మండిపాటు
ప్రస్తుతం సినిమా షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ చిత్రీకరిస్తోన్న కొన్ని సన్నివేశాలు మంగళవారం నాడు బయటకొచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాస్ డైలాగ్స్ చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్ బయటకు రావడంతో చిత్రబృందం కావలారపడుతోంది.
షూటింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఫుటేజ్ లీకైపోతుందంటూ తలలు పట్టుకుంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉంది. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయానికి బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుండడంతో 'పుష్ప' సినిమా కాస్త ముందుగా అంటే డిసెంబర్ 17న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న.. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
Also Read: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?
Also Read : ఉమాదేవి బూతులు.. ఫేక్ జనాలపై ఫైర్ అయిన శ్వేతా.. ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వారే..
Also Read: విశ్వ ఏమిటా ఏడుపు? ‘బిగ్ బాస్’ సీజన్ 5లో ‘పాతాళగంగ’ అవార్డుకు అబ్బాయిలు పోటీ?
Also Read: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్డుపక్కన హోటల్‌లో టిఫిన్ తిన్న బన్నీ.. కాకినాడలో బిజీబిజీ
Also read: నటరాజ్ చెప్పిన ఆ గుంట నక్క రవియేనా..?
Also read: అదిరే అందంతో విష్ణుప్రియ... చూస్తే వావ్ అనాల్సిందే