ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రీసెంట్‌గా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప‌ద‌హారు రోజులు పాటు విదేశాల్లో విహారయాత్ర ముగించుకుని ఆయన ఇండియా తిరిగి వచ్చారు. ఆయనకు కుమార్తె అర్హ (Allu Arha) స్వీట్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 'వెల్కమ్ నాన్న' అంటూ గులాబీ రేకులు, ఆకులతో 'వెల్కమ్ నాన్న' అని డిజైన్ చేయడం విశేషం. అల్లు అర్జున్ స్టాఫ్ (#AA Family) కూడా వెల్కమ్ చెప్పారు. 'పుష్ప' ఫొటోతో కూడిన కేక్ డిజైన్ చేయించడంతో పాటు గొడ్డలిని బన్నీకి ఇచ్చారు.