సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కింది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయనకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్నారు.  ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ను రామ్ చరణ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాదు, గతంలో పలు హిట్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా బన్నీ వదులుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..


1. అర్జున్ రెడ్డి


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే, తొలుత ఈ సినిమా సందీప్ అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారట. కానీ తను ఈ క్యారెక్టర్ కు సూట్ కానని చెప్పడంతో, విజయ్ దేవరకొండను తీసుకున్నారట. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ పేరుతోనే రీమేక్ చేశారు. 


2. బజరంగీ భాయిజాన్


హిందీలో సల్మాన్ నంటించి ‘బజరంగీ భాయిజాన్’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీయాలని దర్శకుడు కబీర్ ఖాన్ భావించారట. కానీ, తను నో చెప్పడంతో సల్మాన్ ఖాన్ వైపు మొగ్గు చూపారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ కోసం చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.  


3. గీత గోవిందం


‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్ లో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, ‘గీత గోవిందం’ తిరుగులేదని నిరూపించుకున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ కోసం ముందుగా అల్లు అర్జున్ అనుకున్నారట. కానీ, కథ ఆయనకు నచ్చకపోవడంతో నో చెప్పారు. ఆ తర్వాత విజయ్ తో ఈ సినిమా తీసి హిట్ కొట్టారు. తన మాస్ ఇమేజ్‌కు ఈ మూవీ సూట్ కాకపోవచ్చనే బన్నీ ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. 


4. భద్ర


రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భద్ర’. ఈ సినిమాలో తొలుత అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారట దర్శకుడు. అయితే, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను బన్నీ రిజెక్ట్ చేశారట. దీంతో రవితేజతో తీసి హిట్ అందుకున్నారు. బన్నీకి ఈ మూవీ బాగా సెట్ అయ్యేదేమో కదా. 


5. లైగర్


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమా బ్లాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సినిమాలో హీరోగా తొలుత అల్లు అర్జున్ ను అనుకున్నాడట పూరి. కానీ, తను తిరస్కరించడంతో విజయ్ తో తీశారు. అయితే, ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది. ఈ నేపథ్యంలో బన్నీ.. ఈ ఒక్క విషయంలో మంచి నిర్ణయమే తీసుకున్నారనిపిస్తుంది. 


6. జవాన్


‘పఠాన్’తో అదరగొట్టిన షారుఖ్, తాజాగా ‘జవాన్’తో ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్ర కోసం అల్లు అర్జున్ ను అడిగారు చిత్ర నిర్మాతలు. కానీ, ఆయన ‘పుష్ప2’ షూటింగ్ లో బిజీగా ఉండటంతో నో చెప్పారు. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ ను రామ్ చరణ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.  






Read Also: ‘బాహుబలి’ ఆడిషన్‌లో రాశీ ఖన్నా - రాజమౌళికి నచ్చినా, ఆ కారణంతో ఛాన్స్ ఇవ్వలేదట!