Navy Chopper Accident:



ముంబయి కోస్ట్‌లో ప్రమాదం..


ఇండియన్ నేవీ చాపర్ ప్రమాదానికి గురైంది. ముంబయి కోస్ట్‌లో  ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో Advanced Light Helicopter (ALH) లో ముగ్గురు ఉన్నారు. నేవల్ పాట్రోల్ క్రాఫ్ట్ అప్రమత్తమై సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ముగ్గురు బాధితులనూ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో విచారించాలని భారత నేవీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉన్నట్టుండి పవర్‌ ఆఫ్ అవడంతో పాటు కిందకు జారిపోయిందని, ఫలితంగా పైలట్ కంట్రోల్ కోల్పోయాడని ఇండియన్ నేవీ ప్రాథమికంగా తెలిపింది. ప్రమాదానికి గురైన ALH-DHRUV ను దేశీయంగా తయారు చేశారు. ఇందులో రెండు ఇంజిన్‌లుంటాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దీన్ని రూపొందించింది. 1984లో వీటి తయారీ మొదలు పెట్టింది. జర్మనీ సహకారంతో డిజైన్ చేసింది. 1992లో తొలిసారి గాల్లోకి ఎగిరిన ఈ హెలికాప్టర్...2002లో అధికారికంగా నేవీలో చేరింది.