తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అడపాదడపా అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయినట్లు వెల్లడించింది. తాను ఇండస్ట్రీల్లో నిలదొక్కుకోవడానికి కారణం రాజమౌళి అని చెప్పిన రాశీ, ఈ సినిమాలో ఎందుకు నటించే అవకాశాన్ని కోల్పోయిందో వివరించింది.


రాజమౌళికి నచ్చినా అవకాశం ఇవ్వలేదు - రాశీ ఖన్నా


దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘బాహుబలి’ సినిమాతో తమన్నా క్యారెక్టర్ తాను చేయాల్సి ఉండేదని చెప్పింది రాశీ. ఈ క్యారెక్టర్ కోసం ఆడిషన్ కు కూడా వెళ్ళిందట. రాజమౌళికి కూడా ఆమె ఫర్ఫార్మెన్స్ బాగా నచ్చిందట. అయితే, ఇంత సున్నితమైన అమ్మాయి చేతిలో కత్తి పట్టుకోవడం తాను చూడలేకపోతున్నాను అని చెప్పారట. ‘బాహుబలి’లో తనను తీసుకోకపోయినా, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా నిర్మాతలకు ఆమెను రికమెండ్ చేశారట రాజమౌళి.


బోల్డ్ సీన్స్ చేయడం తప్పు కాదు- రాశీ


ఇక సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేయడం తప్పేమీ కాదని చెప్పింది రాశీ ఖన్నా. ముద్దులైనా, శృంగారం అయినా, నవ్వులైనా, ఏడుపులైనా నటనలో భాగంగానే చూడాలని చెప్తోంది. తను నటించే సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే ముందుగా ఇంట్లో వాళ్లకు చెప్పి విషయాన్ని వివరిస్తుందట. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందట. కుటుంబ సభ్యులు తనని అర్థం చేసుకుని సపోర్టు చేయడం వల్లే తాను సినిమా రంగంలో రాణిస్తున్నట్లు రాశీ వెల్లడించింది. తన ప్రేమ కథల గురించి కూడా చాలా విషయాలు వెల్లడించింది. చాలాసార్లు తను ప్రేమలో పడినట్లు వివరించింది. అవన్నీ ఫెయిల్యూర్స్ గానే మిగిలిపోయాయని వెల్లడించింది. తన పేరెంట్స్ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారని, తాను కూడా ప్రేమ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. 


నార్త్ లోనూ రాణిస్తున్న రాశీ ఖన్నా


ఇక రీసెంట్ గా రాశీ ఖన్నా తమిళ సినిమా ‘సర్దార్’తో మంచి హిట్ అందుకుంది. కార్తి హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమాతో రాశీకి మళ్లీ యాక్టివ్ అయ్యింది. తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. అటు హిందీలో ‘ఫర్జీ’ అనే వెబ్ సీరీస్ లో నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సీరిస్‌లో రాశీ, మేఘా అనే ఆర్బీఐ అధికారి పాత్రలో కనిపించింది. ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. ఇక సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లోనూ బిజీ అయ్యేందుకు రాశీ ప్రయత్నిస్తోంది. ‘ఫర్జీ’ సిరీస్ తర్వాత హిందీలోనూ పలు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.






Read Also: బన్నీ కాదు చెర్రీ - షారుఖ్ మూవీకి No చెప్పిన అల్లు అర్జున్? Ok చెప్పిన రామ్ చరణ్!