అక్కినేని నాగచైతన్య నటించిన 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సినిమాలో ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కానుంది. జూలై 22న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు నాగచైతన్య. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితం ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ థాంక్యూ నోట్ ను రాసుకొచ్చారు. 'థాంక్యూ' అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటానని.. కానీ కొన్ని సార్లు అదొక్కటే సరిపోదని అన్నారు. తన నెక్స్ట్ సినిమా 'థాంక్యూ' మూవీ ఈ ఆలోచనకు కారణమని.. ఆ సినిమా జర్నీ తనను కదిలించింది అన్నారు.
ఈ పోస్ట్ ను తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులకు డేడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. అలానే ఫ్యాన్స్ ను #themagicwordisthankyou అనే ట్యాగ్ తో తమ లైఫ్ లో ఎవరికి థాంక్యూ చెప్పాలనుకుంటున్నారో ఫొటోలను షేర్ చేసి ట్యాగ్ చేయమని కోరారు. ముందుగా చైతు చిన్నతనంలో తన తల్లితో తీసుకున్న ఫొటోను షేర్ చేసి.. అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ.. తనపై అంతులేని ప్రేమను చూపించిన తల్లికి థాంక్స్ చెప్పారు.
తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. 'నాకు తోడుగా నిలిచినందుకు, అలానే స్నేహితుడిగా ఉన్నందుకు థాంక్స్ నాన్న' అని రాసుకొచ్చారు. వీరిద్దరితో పాటు సమంత పెంపుడు హ్యాష్ తో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. 'ఎలా ప్రేమించాలో, మనిషిగా ఎలా ఉండాలో చూపించినందుకు థాంక్స్' అంటూ కామెంట్స్ చేశారు చైతు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.