Akanksha Puri: బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష పూరి పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఈ బ్యూటీ హిందీ ‘బిగ్ బాస్ ఓటీటీ2’ లో కంటెస్టెంట్ గా చేరింది. అయితే ఇటీవల హౌస్ లో టాస్క్ లో భాగంగా కో కంటెస్టెంట్ జాద్ హదీద్ తో లిప్ కిస్ ను పంచుకుంది. దాదాపు 30 సెకన్ల పాటు లైవ్ కెమెరాల ముందే ఈ జంట ముద్దలతో రెచ్చిపోయింది. అయితే ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సల్మాన్ ఖాన్ ఆకాంక్షను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఆకాంక్ష పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. మికా సింగ్ అనే సింగర్ తో తనకున్న రిలేషన్షిప్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. గతం నుంచీ ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉండటంతో త్వరలో పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో కొత్త చర్చలకు తెరలేపాయి. ప్రస్తుతం ఆకాంక్ష చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


సింగర్ మికా సింగ్ పై ఆకాంక్ష స్పందన..


ఆకాంక్ష పూరిని `స్వయంవర్-మికా ది వోహ్తి`లో తన కాబోయే భార్యగా ఎంపిక చేసుకున్న తర్వాత మికా సింగ్ ఆకాంక్షను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఈ జంట ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. వాస్తవానికి మికా-ఆకాంక్షలు దాదాపు 13 ఏళ్లకు పైగానే పరిచయస్తులు. కొంత కాలంగా మికా తో ఆకాంక్ష డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు 2021 లోనే మొదలైయ్యాయి. తర్వాత సోషల్ మీడియాలోనూ ఇద్దరూ కలసి కనిపించారు. అంతే కాకుండా 2021లో  సింగ్ కారు చెడిపోవడంతో మికా - ఆకాంక్ష ముంబై వర్షాలలో చిక్కుకున్న ఫోటోలు బయటపడ్డాయి. అప్పటి నుంచీ వీరి వివాహం గ్యారెంటీ అనే వార్తలు వచ్చాయి. 


బిగ్ బాస్ హౌస్ లో జాద్ హదీద్ తో కిస్ సంగతేంటి?


'బిగ్ బాస్' ఓటీటీ 2 లో టాస్క్ లో భాగంగా నటుడు జాద్ హదీద్ తో వివాదాస్పదమైన ముద్దు ఘటనపై స్పందించింది ఆకాంక్ష. అది కేవలం టాస్క్ లో భాగమని పేర్కొంది ఆకాంక్ష. ఆ ముద్దు సీన్ ను తన వ్యక్తి గత జీవితంతో ముడిపెట్టడం బాధాకరమని పేర్కొంది. జాద్ పై తనకు ఎలాంటి ఫీలింగ్ లేదని, తన టాస్క్ మాత్రమే తాను చేశానని, ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నా అలానే చేసేదాన్ననని స్పష్టం చేసింది. అయితే అతను టాస్క్ ను మరచిపోయి ఇన్వాల్వ్ అయ్యాడని, తనకు మాత్రం టాస్క్ తప్ప వేరే ఫీలింగ్ ఏమీ లేదని చెప్పింది. 


మికా సింగ్ తో పెళ్లి పై ఆకాంక్ష క్లారిటీ..


బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ మికా సింగ్ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. మికా సింగ్, తాను మంచి స్నేహితులమని చెప్పింది. ప్రస్తుతానికి ఎవరి వర్క్ లో వారు బిజీగా ఉన్నామని, అతనితో డేటింగ్ లు కూడా చేయడం లేదని అయితే తాము ఇప్పటికీ మంచి స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్ లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని అడిగితే.. తాను చేసుకోబోయే వ్యక్తి తనకు మంచి స్నేహితుడు అయి ఉండాలని కోరుకోవడంలో తప్పేముందని, నిజంగా అంతలా ఎవరైనా  దగ్గరైతే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని పేర్కొంది. 


Also Read: దుల్కర్‌ను తిట్టిపోస్తున్న అభిమానులు - అలాంటి పనులు చేయొద్దంటూ హితవు