యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం విమర్శలకు గురవుతున్నారు. ఇటీవల ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఒక విషయంలో తాను ఎంతో బాధపడుతున్నానని, అది చెప్పొచ్చో లేదో తెలీదు అంటూ చెమర్చిన కళ్లతో ఒక వీడియోను షేర్ చేశారు. తర్వాత వెంటనే ఆ వీడియోను డిలీట్ చేశారు. అప్పటికే కొంతమంది  ఆ వీడియోను సేవ్ చేసుకున్నారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దుల్కర్ కు ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం ‘‘ఇదేదో ప్రమోషన్స్ కోసం చేసిన ఎమోషన్ వీడియోలా ఉంది’’ అంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా దుల్కర్ సల్మాన్ ఓ మొబైల్ ఫోన్ ప్రమోషన్స్ వీడియోను రిలీజ్ చేశారు. అది చూసిన నెటిజన్స్ దుల్కర్ పై మండిపడుతున్నారు. 


ఇదంతా యాడ్ ప్రమోషన్స్ కోసమా?


సినిమా హీరోలను అభిమానులు ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండి వరుస సినిమాల్లో నటించాలని కోరుకుంటారు. వాళ్లకి ఏమైనా ఇబ్బంది వచ్చిందని తెలిస్తే తట్టుకోలేరు అభిమానులు. అందుకే తమ ఫేవరేట్ హీరోల గురించి ఏం తెలిసినా వెంటనే స్పందిస్తుంటారు. అయితే దుల్కర్ ఇటీవల తనకు నిద్ర కూడా ఉండటం లేదని, దాని గురించి మర్చిపోలేపోతున్నానని, ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నా అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసి తర్వాత డిలీట్ చేశారు. దీనిపై దుల్కర్ అభిమానులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అది ప్రమోషన్స్ కోసం చేసి ఉంటారని పలువురు సందేహం వ్యక్తం చేశారు. తాజాగా దుల్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన ఓ మొబైల్ ప్రమోషన్స్ వీడియో చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. ఇదంతా ఓ యాడ్ ప్రమోషన్స్ కోసం చేశారని తెలుస్తోంది. దీంతో దుల్కర్ పై మండిపడుతున్నారు అభిమానులు.


ఇలా చేయొద్దంటూ హితవు..


దుల్కర్ సల్మాన్ విడుదల చేసిన వీడియోపై ఇప్పుడు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ వీడియోలో దుల్కర్ ఓ మొబైల్ ఫోన్ దాని ఫీచర్స్ గురించి చెబుతూ.. ఆ ఫోన్ ను తాకకుండా ఉండలేరని, మెడిటేషన్ కూడా మిమ్మల్మి ఆ ఫోన్ నుంచి దూరం చేయలేదని చెప్పుకొచ్చారు. ఆ ఫోన్ కు తాను కూడా ఎడిక్ట్ అయిపోయానంటూ ఆ మొబైల్ గురించి ప్రమోషన్స్ ఇచ్చారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే అందరిలో అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం ఆ నిద్రలేని వీడియోను షేర్ చేసి డీలీట్ చేశారు అంటూ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు అభిమానులు. ‘మీ ప్రమోషన్స్ కోసం అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకుంటారా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేసి అభిమానుల్ని బాధపెట్టొదంటూ హితవు పలుకుతున్నారు. దీంతో దుల్కర్ చేసిన ప్రమోషన్స్ వీడియో చర్చనీయాంశమైంది. మరి దీనిపై దుల్కర్ స్పందిస్తారో లేదో చూడాలి. 


‘కింగ్ ఆఫ్ కొథా’ తో ప్రేక్షకుల ముందుకు..


దుల్కర్ సల్మాన్ సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలు దాదాపు తెలుగులో కూడా డబ్ అవుతాయి. ఇక ‘సీతారామం’ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు ఫుల్ మాస్ అవతారంలో ‘కింగ్ ఆఫ్ కొథా’ మూవీతో వస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. అలాగే వెంకీ అట్లూరి రూపొందిస్తోన్న పాన్-ఇండియన్ మూవీకి కూడా దుల్కర్ సైన్ చేశాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీ నిర్మిస్తుంది. 


Also Read: 'ఆదిపురుష్' మేకర్స్ కు మరో తలనొప్పి.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారా..?