‘Good Bad Ugly’s Second Look Poster: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుంది. ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సెకెండ్ లుక్ రిలీజ్ చేశారు.


అదిరిపోయే లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న అజిత్


‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నుంచి విడుదలైన సెకండ్ లుక్‌ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది. అజిత్ మరింత జోష్ ఫుల్ గా కనిపిస్తున్నారు. బ్లాక్‌‌‌‌ కూలింగ్ గ్లాసెస్‌‌‌‌, చేతిపై డ్రాగన్ టాటూతో ఖైదీ గెటప్‌‌‌‌లో మరింత స్టైలిష్‌‌‌‌గా దర్శనం ఇచ్చాడు. పెద్ద మొత్తంలో గన్‌‌‌‌ ఫైరింగ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం రెండు పోస్టర్లతోనే సినిమాకు ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేశారంటూ మేకర్స్ ను అభినందిస్తున్నారు నెటిజన్లు.






సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’  


ప్రస్తుతం భారత్ లో తెరకెక్కుతున్న అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతోంది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమా కోసం ఫారిన్ టెక్నీషియన్లు సైతం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు దిగ్గజ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా చేస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.


‘విదాముయర్చి’ కోసం రియల్ స్టంట్లు


‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో పాటు ‘విదాముయర్చి’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు అజిత్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అజిత్ చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో స్టంట్లు చేసి ఇప్పటికే గాయపడ్డారు. రీసెంట్ గా మరోసారి ప్రాణాలకు తెగించి స్టంట్లు చేశారు. కారును క్రేన్ తో గాల్లోకి తీసుకెళ్లి పైనే పల్టీలు కొట్టించారు. అజిత్ తో పాటు ఆకారులో ఆరవ్ అనే యాక్టర్ కూడా ఉన్నారు. ప్రాణాలకు తెగించి ఆయన చేసిన స్టంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు.



Read Also: గాల్లో పల్టీలు కొట్టిన అజీత్ కుమార్ కారు - ఆ వీడియో చూసి అభిమానులు షాక్