హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! 'వలిమై' సినిమా షూటింగులో కూడా అజిత్ గాయపడ్డారు. లేటెస్టుగా విడుదల అయిన ట్రైలర్ చూస్తే ఆయన ఎందుకు గాయపడ్డారు? యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది ఆడియన్స్‌కు ఈజీగా అర్థం అవుతుంది.
తెలుగులో 'ఖాకి'గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా 'థీరన్ అధిగారం ఒండ్రు' సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్... ఈ 'వలిమై' సినిమాకు దర్శకుడు. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు... హిందీ హిట్ 'పింక్'ను తమిళంలో 'నెర్కొండ పార్వై'గా తెరకెక్కించారు. 'వలిమై' ట్రైలర్ చూస్తే... అజిత్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారనేది అర్థం అవుతోంది. కొంత మంది బైక్ రైడర్స్ చేసే నేరాలను ఎలా అరికట్టాడు? అనేది కథ అనేది ఊహించవచ్చు. అయితే... మధ్యలో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ అవ్వడం ట్విస్ట్.Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!ట్రైలర్ చూసినప్పుడు కథ, మిగతా నటీనటుల కంటే ముందుగా ఆకట్టుకునేది... యాక్షన్ సీన్స్! బైక్ రైడింగ్, ఛేజింగ్ సీన్స్ అద్భుతంగా తెరకెక్కించారు. అజిత్ యాక్షన్ ఇరగదీశారు. విలన్‌గా నటించిన టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ లుక్, యాక్టింగ్ కూడా ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ సంక్రాంతికి మాంచి యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో హిందీ హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా నటించారు. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు.'వలిమై' ట్రైలర్: