Aishwarya Rai Gets Emotional As She Hugs Deepika Padukone: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకలో రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి సంబురాలకు బాలీవుడ్ సినీలోకం తరలి వచ్చింది. ట్రెడిషనల్ వేర్ లో సినీతారలు ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత అందరూ కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.
దీపికను హగ్ చేసుకుని కంటతడి పెట్టిన ఐశ్వర్య
ఇక ఈ పెళ్లివేడుకలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య ఎమోషనల్ అయ్యింది. కంటతడి పెట్టుకుంది. త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె చెవిలో గుసగుసలాడుతూ కనిపించింది. ఇద్దరు అగ్రతారలు ఏమాత్రం ఈగో లేకుండా ప్రేమగా ఆలింగనం చేసుకోవడాన్ని పక్కనే ఉన్న హృతిక్ రోషన్ చూసి సంతోషంగా ఫీలయ్యాడు. ఒకరికి ఒకరు అప్యాయంగా పలకరించిన ఈ వీడియో వారి ఫ్యాన్స్ ఆకట్టుకుంటుంది.
ఇషా ప్రీ వెడ్డింగ్ బాష్ లోనూ డ్యాన్స్ చేసిన దీపిక, ఐశ్వర్య
నిజానికి ఐశ్వర్య, దీపికా మధ్య మంచి స్నేహం ఉంది. 2018లో జరిగిన ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్ లోనూ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. పక్కనే ఉన్న దీపికను, ఐశ్వర్య డ్యాన్స్ ఫ్లోర్ మీదికి తీసుకెళ్తుంది. అక్కడ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత దీపిక కూడా ఆరాధ్య బచ్చన్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ఆమెతో కలిసి ఫోటోలకు పోజులిచ్చిది. అటు ఈ పెళ్లి వేడుకలో సీనియర్ నటి రేఖను ఐశ్వర్య కలిసింది. ఇద్దరూ కలిసి కాసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. రేఖ ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యతో ముచ్చటిస్తూ కనిపించింది. అందరూ కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచి ఆకట్టుకున్నారు.
ఐశ్వర్య ఎందుకు సఫరేట్ గా వచ్చింది?
అంబానీ పెళ్లికి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి సఫరేట్ గా రావడం, ఆ తర్వాత బచ్చన్ కుటుంబ సభ్యులు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ తో అంటీముట్టనట్లు ఉంటుందని, త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు వినిస్తున్నాయి. అంబానీ పెళ్లిలో అభిషేక్ బచ్చన్ తన పేరెంట్స్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. ఐశ్వర్య వారి దగ్గరికి వెళ్లకపోవడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతుంది.
అంబానీ పెళ్లికి తరలి వచ్చిన సినీ దిగ్గజాలు
అంబానీ పెళ్లికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు తరలివచ్చారు. ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, రణబీర్ కపూర్, అలియా భట్ సహా పలువురు బలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ రియాలిటీ షో హోస్టు కిమ్ కర్దాషియాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలుగు నుంచి కూడా పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు. WWE సూపర్ స్టార్ జాన్ సెనా కూడా ఈ పెళ్లిలో తళుక్కున మెరిశాడు.
Read Also: పెళ్లి దుస్తుల్లో యువరాణిలా మెరిసిన రాధికా మర్చంట్- ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?