Radhika Merchant Wedding Designer Dress: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ ముద్దుత కూతురు రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. శుక్రవారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక కన్నుల పండువగా జరిగింది. పెళి సంబురాలకు దేశ విదేశాలకు చెందిన సినీ, క్రీడా, రాజకీయ రంగాలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
డిజైనర్ డ్రెస్‌లో మహరాణిలా మెరిసిపోయిన రాధికా మర్చంట్
పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ధరించిన ఆరెంజ్ కలర్ షేర్వానీ అందరినీ ఆకట్టుకుంది. రాధికా మర్చంట్ ధరించిన డిజైనర్ దుస్తులు చూపరులను ఎంతగానో అలరించింది. పెళ్లి దుస్తుల్లో రాధిక యువరాణిలా కనిపించింది. ప్రముఖ డిజైనర్ సందీప్ ఖోస్లా రాధికా మర్చంట్ పెళ్లి దుస్తులను స్పెషల్ గా డిజైన్ చేశారు. ఎరుపు, గోధుమ వర్ణంలో ఈ డ్రెస్ ను రూపొందించారు.
పూర్తిస్థాయి గుజరాతీ సంప్రదాయ పద్దతిలో రూపొందించారు. ఈ డ్రెస్ కు సంబంధించి ఎంబ్రాయిడరీ పూర్తి స్థాయిలో చేతితో వేశారు. ఘాగ్రాకు విలువైన రత్నాలను పొదిగారు. 5 మీటర్ల పొడవున్న ఈ ఘాగ్రా హెడ్ వీల్, టిష్యూ షోల్డర్ తో సహా మూడు అంచుల్లో మెరుస్తూ కనిపిస్తుంది. తంబా టిక్కీలు, రెడ్ రేషమ్ తో అత్యంత లగ్జరీగా రూపొందించారు. తల మీద ఉండే ముసుగు అత్యంత సున్నితమైన జాలీ కట్ వర్క్ ను కలిగి ఉంది. మొత్తంగా వెడ్డింగ్ డ్రెస్ లో రాధిక మర్చంట్ యువరాణిలా కనిపించింది.
అద్భుతంగా అలంకరించిన రోల్స్ రాయిస్ లో పెళ్లి మండపానికి అనంత్
వివాహానికి ముందు అనంత్ అంబానీ, తన నివాసం అంటీలియా నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రోల్స్ రాయిస్ కారులో బయల్దేరారు. బ్యాండ్ బాజాల సందడి, బంధు మిత్రుల బరాత్ నడుమ అనంత్ పెళ్లి మండపానికి చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం అనంత్, రాధిక వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నిర్వహించి బారాత్ కోలాహాలంగా జరిగింది. సంప్రదాయ నృత్యాలతో పాటు పలువురు సెలబ్రిటీలు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ, పెళ్లి కూతురు రాధికా మర్చంట్ కూడా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో నీతా అంబానీ స్పెషల్ గా డ్యాన్స్ చేశారు. అమెరికన్ యాక్టర్, రాపర్ జాన్ సెనా, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్టర్లు అనిల్ కపూర్, రణవీర్ సింగ్ స్టెప్పులతో దుమ్మురేపారు.
Read Also: రజినీకాంత్ ఆఫ్ స్క్రీన్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? అంబానీ ఇంట పెళ్లంటే అంతే మరి!
ఇవాళ శుభ్ ఆశీర్వాద్, రేపు రిసెప్షన్
జులై 12న అనంత్-రాధిక పెళ్లి జరగ్గా.. ఇవాళ(జులై 13న) శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరగనుంది. అంటే పెద్దలు అంతా కలిసి నూతన వధూవరులకు ఆశీర్వాదం అందిస్తారు. జులై 14న పెళ్లి రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనే అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అంటే, లెహంగా, షేర్వాణీ, కుర్తాల్లో రావాలని అంబానీ దంపతులు విజ్ఞప్తి చేశారు.
Read Also: అనంత్ అంబానీ పెళ్లి - ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసిన స్థానిక కంపెనీలు, అసలు ఏమైంది?