Anant Ambani Radhika Merchant Wedding : రజినీకాంత్ ఆఫ్‌ స్క్రీన్‌ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? అంబానీ ఇంట పెళ్లంటే అంతే మరి!

Rajinikanth Dance At Anant Ambani Radhika Merchant Wedding: అంబానీ ఇంట పెళ్లంటే అలానే ఉంటుంది. ప్రముఖులంతా వచ్చి వధూవరులను ఆశీర్వదించి డ్యాన్స్‌లతో సందడి చేశారు.

Continues below advertisement

Anant Ambani Radhika Merchant Wedding : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు, పెళ్లి జరిగిన తీరును చూసి అంతా ఆశ్చర్యపోయారు. వేడుకలు జరుగుతున్న తీరును చూసి హోదా, పలుకుబడి అన్నింటినీ మర్చిపోయి సెలబ్రిటీలంతా గ్రూప్ డ్యాన్స్ చేశారు. 

Continues below advertisement

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా సాగాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్‌లతో అదరగొట్టారు. పాటలతో హోరెత్తించారు. చివరకు సీనియర్ నటుడు రజినీకాంత్ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

రజినీకాంత్ చేసిన డ్యాన్స్‌ పెళ్లిలోనే హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి రజనీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు 'గల్లన్ గుడియా' పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ అశ్చర్యపరిచారు.  

రజినీకాంత్ ఈ స్టైల్‌లో డ్యాన్స్ చేయడం గతంలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. సినిమాల్లో తప్ప బయట ఇలాంటివి పెద్దగా ఎంటర్‌టైన్ చేయని రజినీకాంత్‌ ఇప్పుడు దుమ్మురేపారు. ఒకవైపు 67 ఏళ్ల అనిల్ కపూర్, మరోవైపు 73 ఏళ్ల రజినీకాంత్ డాన్స్ మూవ్స్‌తో అందర్నీ ఉత్సాహపరించారు. 

కుటుంబ సమేతంగా రజినీకాంత్
అంబానీ కుటుంబం ఆహ్వానం మేరకు రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి అనంత్, రాధిక వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. 
రజీనీ కాంత్ మాత్రమే కాదు... క్రికెట్ హార్దిక్ పాండ్యా, యానిమల్ విలన్ బాబి డియోల్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్,  జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, ప్రియాంక చోప్రా, డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ జాన్ సీనా సహా అంతా అనంత్ అంబానీ వివాహ ఊరేగింపులో డ్యాన్స్ చేశారు. 

ముకేశ్ అంబానీకి చెందిన వరల్డ్ జియో సెంటర్‌లో అనంత్, రాధిక రాయల్ స్టైల్ లో పెళ్లి జరిగింది. ఈ వివాహానికి దేశ విదేశీ అతిథులు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు హాజరుకాగా, క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన ప్రముకులు హాజరైన ఆశీర్వచనాలు అందించారు. 

Continues below advertisement