US Presidents Assassinated: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన ఘటన సంచలనమవుతోంది. ఆయన స్పీచ్ ఇస్తుండగా ఇద్దరు దుండగులు హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తృటిలో ట్రంప్‌కి ప్రాణాపాయం తప్పింది. అయితే...అమెరికాలో ఇలా అధ్యక్ష స్థాయిలో ఉన్న వ్యక్తులపై కాల్పులు జరపడం కొత్తేమీ కాదు. చరిత్రని పరిశీలిస్తే 1912లో థియోడోర్ రూజ్‌వెల్ట్ ( Theodore Roosevelt) ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌లాగే అప్పటికే ఓ సారి అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఓ చోట స్పీచ్ ఇచ్చేందుకు వెళ్తుండగా సెలూన్ షాప్‌లో పని చేసే ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన చేతిలో ఓ బుక్ ఉంది. దానికి ఆయన శరీరంలోకి బులెట్ దూసుకుపోయింది. ఫలితంగా ప్రాణాపాయం తప్పింది. కానీ ఆయన బాడీలో మాత్రం బులెట్ అలాగే ఉండిపోయింది.
ఈ కాల్పులు జరిగిన తరవాత కూడా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ తరవాత 1933లో ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్‌పైనా హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో ఫ్రాంక్లిన్ తప్పించుకున్నప్పటికీ ఆ బులెట్ చికాగో మేయర్‌కి తగిలి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. రూజ్‌వెల్ట్ తరవాత అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న హ్యారీ ట్రూమన్ 1950లో వైట్‌హౌజ్‌కి సమీపంలోనే హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. వీళ్లంతా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
అంతకు ముందే అంటే 1865లో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ (Abraham Lincoln Assassination) దారుణ హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్ వద్ద ఆయనను కాల్చి చంపారు. ఓ నాటక ప్రదర్శనకు వచ్చిన లింకన్‌ని ఆ డ్రామాలో యాక్ట్ చేసిన నటుడే కాల్చి చంపాడు. ఆ తరవాత 1881లోనూ అప్పటి అధ్యక్షుడు జేమ్స్ గార్‌ఫీల్డ్‌పై ఓ రైల్వే స్టేషన్ వద్ద కాల్పులు జరిగాయి. తీవ్ర గాయాలతో కొద్ది రోజుల తరవాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగం రాలేదన్న కోపంతో ఓ యువకుడు ఇలా ఆయనపై కాల్పులు జరిపాడు. 1901లో న్యూయార్క్‌లో అప్పటి అధ్యక్షుడు విలియమ్ మెక్‌కిన్లీ కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యారు.
1963లో అధ్యక్ష పదవిలో ఉన్న జాన్ ఎఫ్ కెన్నడీని (John F. Kennedy) డల్లాస్‌లో ఓ దుండగుడు కాల్చి చంపాడు. 1968లో జాన్ కెన్నెడీ సోదరుడు రాబర్ట్ కె ఫెన్నెడీ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. లాస్‌ఏంజెల్స్‌లోని ఓ హోటల్‌లో ఆయన హత్యకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇలాంటి యత్నమే జరిగింది. ఫలితంగా మరోసారి అమెరికా ఉలిక్కిపడింది. కాస్త అటు ఇటు అయినా ట్రంప్‌కి ప్రాణాపాయం తప్పేది కాదు. ఆయన వెంటనే తప్పించుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపైFBI విచారణ చేపడుతోంది. 20 ఏళ్ల యువకుడు థామస్ మాథ్యూ ఈ కాల్పులకు పాల్పడినట్టు గుర్తించారు. ఘటనా స్థలంలోనే సెక్యూరిటీ ఆ యువకుడిని హతమార్చింది.
Also Read: Trump Rally Shooting: ట్రంప్‌పై దాడి చేసింది ఈ యువకుడే, కీలక ప్రకటన చేసిన FBI